నీటి కోసం విద్యార్థుల రాస్తారోకో
కమలాపూర్: ఆశ్రమ పాఠశాలలో మంచినీరు కూడా అందుబాటులో లేదంటూ విద్యార్థులు రోడ్డెక్కారు. కరీంనగర్ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానిక మహాత్మాజ్యోతిబా ఫూలే (ఎంజేపీ) గురుకుల ఆశ్రమ పాఠశాలలో మంచినీరు కూడా అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులు మంగళవారం ఉదయం రాస్తారోకో చేశారు. కనీస వసతులు కూడా లేవని, తమను పట్టించుకునే వారే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉంటున్న అద్దె భవనం బదులు, సొంత భవనం నిర్మించి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.