నీటి సంరక్షణ కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలి
కరీంనగర్, సెప్టెంబర్ 7 (జనంసాక్షి):వర్షపు నీరు వృదా పోకుండా భూమిలో ఇంకించి భూగర్బ జలాలను పెంచేందుకు వీలుగా వివిద పథకాల కింద జలసంరక్షణ పథకాల కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని జిల్లా కలెక్టర్ సర్పరాజ్ ఆహ్మద్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావే శమందిరంలో జిల్లా అధికారులతో నీటి సంరక్షణపై సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ నాబార్డ్ ద్వారా గ్రావిూణ ప్రాంతాల్లో బోర్ వెల్స్ రిచార్జ్ ఓపెన్ వెల్స్ రీచార్జి ఫాంపౌండ్స్ నిర్మాణం 105 గ్రామాల్లో చేపడుతున్నామన్నారు. భూగ ర్బ జలశాఖ ద్వారా చిగురుమామిడి మండలంలో వాగులపై సబ్ సర్పేజ్ డైక్ల నిర్మాణం, ఫాంపౌండ్స్ నిర్మాణం చెక్ డ్యాం ఓపెన్ వెల్‌ల రీచార్జి మొదలైనపనులు చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయశాఖ ద్వారా తక్కువ నీరు ఎక్కువ సాగులో బాగంగా చెక్ డ్యాంల నిర్మాణం ఫాంపౌండ్స్ బోరు బావులు పైప్‌లైన్ల నిర్మాణం మొదలైన పనులు చేపట్టాలన్నారు. జిల్లా గ్రావిూణాభివృద్దిశాఖ ద్వారా చెరువులలో పూడిక తీత పనులు సోపిడ్స్ నిర్మాణం ఫాంపౌండ్స్ మిని పర్కులేషన్ ట్యాంక్స్ రీచార్జ్ పిట్స్ రెయిన్ అర్వెస్టింగ్ స్టక్చ్రర్ నిర్మాణాలు చేపట్టాల న్నారు. ఈ పనులన్నింటికి వారం రోజుల్లోగా అంచనాలు తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. తరువాత సమావేశంలో కార్యాచరణ ప్రకారం పనుఉల చేపడతామన్నారు, సమావేశంలో నాబార్డ్ ఎజిఎం రవిబాబు, డీఆర్డీఓ వెంకటేశ్వర్రావు జిల్లా వ్యవసాయాధికారి శ్రీదర్‌తదితరులు పాల్గొన్నారు.