మహిళల అభిప్రాయాల సేకరణ…
నిజామాబాద్,సెప్టెంబర్24(జనంసాక్షి):ఇటీవల కురిసిన వానలతో జిల్లా రైతంగాం ఆనందం వ్యక్తం చేస్తోంది. జిల్లాలో అన్నీ ప్రాంతాల్లో సాధారణం, అంతకంటే ఎక్కువ మండలాల్లో వర్షం పడింది. ఖరీఫ్ సీజన్ గట్టెక్కుతున్న ప్రస్తుత తరుణంలో రబీపై ఇన్నాళ్లులేని ఆశలు ఇప్పుడు చిగురించాయి. రైతులకు కష్టాలు తప్పినట్లేనని మంత్రి పోచారం అభిప్రాయపడ్డారు. చెరువులు, కుంటలు, ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. ఇప్పటివరకు సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైన మండలాల్లో ఈ రెండు రోజుల్లో పరిస్థితి తారుమారైంది. నిజాంసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులపై భవిష్యత్తుపై భరోసా కలిగింది. ఉత్తర తెలంగాణ జిల్లాల సాగుకు సంజీవనిగా ముద్ర ఉన్న శ్రీరాంసాగర్ జలాశయంలోకి ఆశించినంతగా వరద నీరు చేరలేదు. మరోవైపు మిషన్ కాకతీయ కింద ఈ చెరువుల్లో చేపట్టిన మరమ్మతు పనుల్లో నాణ్యతా లోపం వెక్కిరిస్తోంది. చిన్న తరహా ప్రాజెక్టులైన కల్యాణి, సింగీతం రిజర్వాయర్ల నిండిపోయి భారీగా వరద నీరు చేరితేనే నీరు విడుదలవుతుంది.