నీ మైండ్‌ ట్యాప్‌..

1

– ఫోన్‌ ట్యాప్‌ జరుగలేదు

– నిరూపిస్తే దేనికైనా సిద్ధం

– రుజువు చేయలేకపోతే జైలుకెళ్తావా?

– హోం మంత్రి నాయిని సూటి ప్రశ్న

హైదరాబాద్‌,జూన్‌22(జనంసాక్షి):

తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయలేదని ఆ రాష్ట్ర ¬ంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించి ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు రుజువులుంటే.. మేం దేనికైనా సిద్ధమని ఆయన ప్రకటించారు. ఆరోపణలు రుజువు చేయకపోతే జైలుకు వెళ్లడానికి మీరు సిద్ధమేనా? అని ఆయన ప్రశ్నించారు.  సోమవారం నాడు ఆయన విూడియాతో మాట్లాడుతూ ఫోన్‌ టాపింగ్‌ కాదు..మైండ్‌ టాపింగ్‌ చేయాలని ప్రయత్నిస్తున్నారని ఆయన విమర్శించారు. టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డి ఓటుకు నోటు కేసులో తాము ఎవరితో లాలూచీ పడలేదని తెలంగాణ ¬ం మంత్రి నాయిని నరసింహరెడ్డి చెప్పారు. ఆ కేసు లో అవినీతి నిరోదక శాఖ తన పనితాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.కేసులో రాజీపడ్డారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాము ఎవరితోను రాజీపడవలసిన అవసరం లేదని ఆయన అన్నారు.ఈ కేసులో ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించనవసరం లేదని ఆయన అన్నారు. ఎవరినీ ఉపేక్షించడం జరగదన్నారు. అవినీతి కేసులో ఎవరైనా చట్టం ముందు ఒకటేనన్నారు. కాగా డిజిపి అనురాగ్‌ శర్మ కూడా ఈ కేసు విషయం ,ఎవరికి నోటీసు ఇవ్వాలి? మొదలైనవన్నీ ఏసిబినే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కాంగ్రెస్‌ కేసును నీరుగారుస్తున్నారన్న ఆరోపణలు  చేస్తోంది. ఇదిలావుంటే తెలంగాణ ప్రభుత్వం ఎవరి ఫోన్లు ట్యాప్‌ చేయలేదని  నాయిని నర్సింహారెడ్డి స్పష్టం చేశారు.  ఓటుకునోటు వచ్చాకనే ట్యాపింగ్‌ వ్యవహారాన్ని టిడిపి తెలరపైకి తెచ్చిందన్నారు. తెలంగాణ ¬ం మంత్రి నాయిని నరసింహారెడ్డి ఎపి ప్రభుత్వానికి మరో సవాల్‌ చేశారు. ఫోన్‌ టాపింగ్‌ రుజువు చేస్తే దేనికైనా సిద్దమేనని ఆయన అన్నారు. విజయవాడ భవానిపురం పోలీస్‌ స్టేషన్‌ లో ఎపి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌ ప్రత్యేక విచారణ చేపట్టిన నేపద్యంలో నాయిని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకుంది.  చట్టం తన పని తాను చేసుకుపోతుందని ఆయన అన్నారు.తెలంగాణ ప్రభుత్వం చెప్పినదానికన్నా ఎక్కువ పనులు చేస్తున్నదని నాయిని తెలిపారు. కాగా విజయవాడ లో సిట్‌ దర్యాప్తునకు ఒకరిద్దరే ఆపరేటర్లు హాజరయ్యారు. వారితో ఐదుగంటలుగా సమావేశం జరపుతున్నారు.రాష్ట్రంలో కరెంట్‌ సమస్యను గురించి గత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదని ¬ం మంత్రి నాయిని నర్సింహరెడ్డి అన్నారు. పాలమూరు ఎత్తిపోతల పథకంతో మంచినీటి కష్టాలను తీర్చుతామని అన్నారు. గోదావరి, కృష్ణా జలాలను తీసుకొచ్చి సాగునీరు, తాగునీటి అవసరాలను తీర్చుతామని పేర్కొన్నారు. ఈ విషయంలో వంద శాతం అంకితభావంతో పనిచేస్తున్నామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వాటర్‌ గ్రిడ్‌ పథకాన్ని ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు.