నుమాయిష్ షురూ…
– ప్రారంభించిన సీఎం కేసీఆర్
హైదరాబాద్,జనవరి 2(జనంసాక్షి):నగరంలో నుమాయిష్‌గా పేరుగాంచిన పారిశ్రామిక ప్రదర్శన షురూ అయింది. ఇవాళ సాయంత్రం జరిగిన కార్యక్రమంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జ్యోతి ప్రజ్వలన చేసి ఎగ్జిబిషన్‌న ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులు ప్రజలను ఎగ్జిబిషన్ సందర్శనకు అనుమతించారు. ఎంతో కష్టపడి ఏర్పాట్లు చేసిన ఎగ్జిబిషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనలో… ప్రభుత్వ, ప్రైవేట్ స్టాళ్లు సహా పలు ఉత్పత్తులను ప్రదర్శించారు. 46 రోజులపాటు ఈ నుమాయిష్ జాతర కొనసాగనుంది. సీఎం మాట్లాడుతూ.. ఎగ్జిబిషన్ నిర్వాహకులను అభినందించారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కాగా, 76వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్)లో ప్రభుత్వ, ప్రైవేట్ స్టాళ్లు, పలు ఉత్పత్తులను ప్రదర్శనకు ఉంచారు. 46 రోజులపాటు ఈ నుమాయిష్ కొనసాగనుంది. ప్రతియేటా ఈ ప్రదర్శన నూతనంగా ఆవిష్కారం అవుతోంది.
సొసైటీ సేవలు ప్రశంసనీయం
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఎగ్జిబిషన్ సొసైటీకి స్థలంపై హక్కులు కల్పించారు. కార్పొరేట్ కళాశాలలకు ధీటుగా పేదపిల్లలకు విద్యనందిస్తున్నం. తెలంగాణ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఎదుగుతుంది. విద్యతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరికొంత మంది పేద విద్యార్థులకు విద్యనందిస్తమని ఆయన పేర్కొన్నారు. 76 ఏళ్లుగా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్న హైదరాబాద్ నాంపలిల్లోని ఎగ్జిబిషన్ సొసైటీని మంత్రి ఈటెల రాజేందర్ అభినందించారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా మరికొంత మంది పేద విద్యార్థులకు విద్యనందిస్తమని రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎందరో పేద విద్యార్థులు భారం లేకుండా చదువుకునేందుకు సొసైటీ విద్యాసంస్థలు దోహదపడుతున్నాయని కొనియాడారు. 46 రోజుల పాటు సాగే అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శనను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన తర్వాత జరిగిన సభలో మంత్రి మాట్లాడారు. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్ స్థలంపై సొసైటీకి హక్కులు కల్పించేందుకు సీఎం కేసీఆర్ చర్యలు తీసుకున్నారని ఈటెల గుర్తు చేశారు. త్వరలోనే సంబంధిత పత్రాలను అందజేస్తామని ప్రకటించారు. ఎగ్జిబిషన్ సొసైటీ జిల్లాల్లో కూడా తన సేవా కార్యక్రమాలను అందించాలని, దానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఈటెల హావిూ ఇచ్చారు. సభ తర్వాత నిర్వాహకులు ప్రజలను ఎగ్జిబిషన్ సందర్శనకు అనుమతించారు. 76వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ లో ప్రభుత్వ, ప్రైవేట్ స్టాళ్లలో పలు ఉత్పత్తులు, సేవలను ప్రదర్శనకు ఉంచారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఈటెల రాజేందర్, పద్మారావు, తలసాని శ్రీనివాస యాదవ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, ఎంపీ బూర నర్సయ్య గౌడ్, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి వేణుగోపాలచారి, ఎమ్మెల్యే శ్రీనివాస గౌడ్, ఎగ్జిబిషన్ సొసైటీ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.