*నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి : డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి*

కోదాడ. సెప్టెంబర్ 14 (జనం సాక్షి )
రేపు అనగా సెప్టెంబర్ 15వ తారీకు అన్ని పాఠశాలల్లో , అన్ని అంగన్వాడి మరియు జూనియర్ కళాశాలల పరిధిలో 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు గల బలబాలికలకు నిర్వహించే నులిపురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆరోగ్య సిబ్బందిని కోరారు. కోదాడ పట్టణ మరియు కోదాడ మండల పరిధిలోని ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ టీచర్లు సంబంధిత గ్రామాలలోని, అంగన్వాడిలోని, పాఠశాలల్లోని చిన్నారులను గుర్తించి వారికి ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలని పేర్కొన్నారు. చిన్నారుల్లో కడుపునొప్పికి కారణమైన నులిపురుగుల వల్ల వారి ఏకాగ్రత దెబ్బతిని , రక్తహీనత వచ్చే అవకాశం ఉందని, విద్యార్థుల్లో తరచుగా కడుపునొప్పికి కారణమైన ఈ నులిపురుగుల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చేతుల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలని కోరారు.