నూతన ఎక్సైజ్ పాలసీ
పాత పద్దతినే కొనసాగింపు
వెల్లడించిన సీఎం కేసీఆర్
ప్రస్తుతం అమలు చేస్తున్న ఎక్సైజ్ విధానాన్నే కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబర్ నుంచి అమలు చేసే ఎక్సైజ్ పాలసీని సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. ఎక్సైజ్ పాలసీపై హైదరాబాద్ బేగంపేటలోని ముఖ్యమంత్రి అధికార నివాసంలో సీఎం కేసీఆర్ సవిూక్ష జరిపారు. ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు, రెవెన్యూ (ఎక్సైజ్) శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ మిశ్రా, ఎక్సైజ్ శాఖ కమిషనర్ చంద్రవదన్, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. రిటైల్ వైన్ షాపుల కోసం నోటిఫికేషన్ ఇచ్చి, దరఖాస్తులు కోరాలని సీఎం కేసీఆర్ సూచించారు. ఒకే షాపుకి ఎక్కువ దరఖాస్తులు వస్తే లాటరీ పద్ధతిలో ఎంపిక చేయాలని ఆదేశించారు. రెండేళ్ల కాలపరిమితికి లైసెన్సులు ఇవ్వాలని చెప్పారు.