నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ

పెద్దమారు గ్రామ సర్పంచ్ గోవిందు శ్రీధర్ రెడ్డి.

చిన్నంబావి అక్టోబర్ 6 జనం సాక్షి

చిన్నంబావి మండలంలోని పెద్దమరూర్ గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి శుక్రవారం గ్రామ సర్పంచ్ గోవిందు శ్రీధర్ రెడ్డి భూమి పూజ చేశారు. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులు 20 లక్షల రూపాయలతో నూతన భవన నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. అదే విధంగా సర్పంచ్ మాట్లాడుతూ కుల వృత్తులకు రైతులకు అండగా ఉంటూ దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని పేర్కొన్నారు. వ్యవసాయానికి సాగునీరు, ఉచిత కరెంట్‌తో పాటు పంట పెట్టుబడి కోసం రైతుబంధు, రైతు కుటుంబాలకు ఆసరాగా రైతు బీమా పథకం అండగా నిలుస్తున్నాయని, గొల్ల కురుమలకు ఉచితంగా గొర్రెలు, రజక, నాయీ బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్‌ అందిస్తున్నరన్నారు. అర్హులైన వృద్ధులకు, బీడీ కార్మికులు, గృహాలక్ష్మి, దళిత బంధు, ఒంటరి మహిళలు, గీత, నేత కార్మికులందరికీ ఆసరా పింఛన్లు, ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకం, సర్కారు దవాఖానల్లో మెరుగైన వైద్యసేవలు అందిస్తూ పల్లెలను అభివృద్ధి బాటలో నిలిపేందుకు పంచాయతీలు ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ కే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోవిందు శ్రీధర్ రెడ్డి, ఉప సర్పంచ్ బీసన్న, సింగిల్ విండో చైర్మన్ బగ్గారి నరసింహారెడ్డి, యస్.శ్రీనివాసులు, గడ్డం నరహరి, పంచాయతీ కార్యదర్శి బి శ్రీనివాసులు, స్థానిక టీఆర్ఎస్ నాయకులు లోకేష్, యాసిన్, తుమ్ముకుంట మల్లయ్య, పెద్ద బాలయ్య, కృష్ణయ్య, తిరుపాలు, పెంటయ్య, తెలుగు చంద్రయ్య, తెలుగు కృష్ణయ్య, జయరాములు తదితరులు పాల్గొన్నారు.