నూతన తహసీల్దార్ కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

జిల్లా కలెక్టర్ కె.శశాంక్
పెద్దవంగర అక్టోబర్ 09 (జనం సాక్షి )
ప్రజలకు అవసరమైన ప్రభుత్వ సేవలను ఒకే చోట అందించే విధంగా నూతన మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, నీటి సరఫరా శాఖ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మండల కేంద్రంలో కోటి రూపాయల వ్యయంతో నిర్మించనున్న తహసిల్దార్ కార్యాలయ భవనానికి ఆదివారం జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు
ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన మండలాలలో మొట్టమొదటిసారిగా పెద్దవంగర మండలంలోనే తహసిల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోబోతున్నామనీ మంత్రి అన్నారు. ప్రజలకు అన్ని శాఖలసేవలు ఒకే చోట అందుబాటులో ఉండేందుకే మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నామని తహసిల్దార్ కార్యాలయంతో పాటు ఎంపీడీవో కార్యాలయం భవన నిర్మాణానికి కోటి రూపాయలను మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.
మండలంలో ఇప్పటికే రోడ్ల అభివృద్ధికి 70 కోట్లు ఖర్చు చేసామని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.
గత ప్రభుత్వాలు అమలు చేయని వినూత్న పథకాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుందని , మన రాష్ట్రంలో అమలవుతున్న పథకాలను ఇతర రాష్ట్రాలు అవలంబిస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి అన్నారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు 10% రిజర్వేషన్ కల్పించిందని , తండాలను గ్రామపంచాయతీలుగా మార్చుకొని గ్రామాలను అభివృద్ధి పథంలో నిలిపామని మంత్రి అన్నారు. తన నియోజకవర్గానికి దళిత బందు కింద 1500 కేటాయింపు జరిగిందని రాబోయే మూడేళ్లలో ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షలు ఇచ్చే ప్రణాళికను సిద్ధం చేశామని మంత్రి అన్నారు.
ఈ సంవత్సరం కేటాయించబడిన 1500 కుటుంబాలను రాబోయే మూడు నెలల్లో దళిత బంధు అందిస్తామని మంత్రి అన్నారు. కాంగ్రెస్ బిజెపి పార్టీల నాయకుల ప్రజలను రెచ్చగొట్టే వాక్యాలు చేస్తున్నారు. బిజెపి కాంగ్రెస్ పార్టీలు మత చిచ్చులు పేడుతున్నాయి తెలంగాణ ప్రజలు వాటిని తిప్పి కొట్టాలి. తెలంగాణ రాష్ట్రంలోని అమలవుతున్న సంక్షేమ పథకాలు కాంగ్రెస్ బిజెపి పాలిత రాష్ట్రాలలో అమలవుతున్నాయాప్రజలు గమనించాలి. కేంద్ర ప్రభుత్వం రైతుల వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నాది. మీటర్లు పెట్ట నిద్దామా తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధిని దేశం మొత్తంకెసిఆర్ పెట్టిన( బి ఆర్ ఎస్ )జాతీయ పార్టీని ఆహ్వానిస్తుంది అన్నారు. తరువాత
జిల్లా కలెక్టర్ కె. శశాంక మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం ఏర్పాటు చేసుకున్న కొత్త మండలాల్లో అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించేందుకు కోటి రూపాయల వ్యయంతో పెద్దవంగర మండల కేంద్రంలో తహసిల్దార్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు.
పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యుల ఆధ్వర్యంలో స్థల దానం జరిగిందని అదేవిధంగా నిధులు మంజూరయ్యాయని కలెక్టర్ తెలిపారు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టనున్న తహసీల్దార్ కార్యాలయ భవన నిర్మాణాన్ని త్వరలో పూర్తిచేసి ప్రజలకు సేవలు మరింత చెరువు అయ్యే విధంగా మండల కేంద్రంలో ప్రభుత్వ శాఖల సేవలను అందిస్తామని కలెక్టర్ అన్నారు. అనంతరం
గ్రామీణ వికాస్ బ్యాంక్ ద్వారా మహిళా సంఘాలకు బ్యాంక్ లింకేజ్ కింద అందిస్తున్న 6 కోట్ల రూపాయల చెక్కును ఈ సందర్భంగా మంత్రి జిల్లా కలెక్టర్ తో కలిసి మహిళా సంఘాలకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో
స్థానిక సర్పంచ్ వెనుక దాసుల లక్ష్మి ,
ఎంపీపీ ఈదురు రాజేశ్వరి,
జడ్పిటిసి శ్రీరామ్ జ్యోతిర్మయి ,
ఎంపీటీసీ ఎదునూరి శ్రీనివాస్, పంచాయతీరాజ్
ఎస్ ఈ రఘువీరారెడ్డి, ఎక్జిక్యూటివ్ ఇంజనీర్ సురేష్,ఆర్.డి.ఓ రమేష్, తహసిల్దార్
రమేష్ బాబు, స్థల
దాతలు జాటోత్ నెహ్రూ నాయక్, కేతిరెడ్డి సోమ నరసింహరెడ్డి, అన్నా బత్తుల ప్రభాకర్, పాలకుర్తి యాదగిరిరావు, చెరుకు ఉమామహేశ్వర్ రెడ్డి, అన్నా బత్తుల నాగేశ్వరరావు, ముప్పాల సురేష్ బాబు, పసుపులేటి వెంకటరామయ్య, వి. రామచంద్రయ్య శర్మ .ఈదురు ఐలయ్య. శ్రీరామ సంజయ్.శ్రీరామ సుధీర్ ఎంపీటీసీలు , జడ్పీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు .బి ఆర్ఎస్ నాయకులు సంబంధిత అధికారులు స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.