నూతన పారిశ్రామిక విధానంపై జూన్7న అధికారిక ప్రకటన
సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష
హైదరాబాద్,మే25(జనంసాక్షి): టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్న సందర్భంగా నూతన పారిశ్రిమక విధానానికి సిఎం కెసిఆర్ కసరత్తు చేస్తున్నారు. జూన్ 7న నూతన పారిశ్రామిక విధానం ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. నూతన పారిశ్రామిక విధానానికి ప్రభుత్వం తుదిరూపు ఇవ్వనుంది. నూతన పరిశ్రమల ఏర్పాటు కోసం 15 రోజుల్లోనే అనుతులు ఇవ్వనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. పరిశ్రమలకు భూమి, నీరు, విద్యుత్ ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. టీఎస్‌ఐఐసీకి ఇప్పటికే 1.6 లక్షల ఎకరాల భూమి అప్పగించాం. టీఎస్‌ఐఐసీ ద్వారానే పరిశ్రమలకు భూములు కేటాయిస్తామని పేర్కొన్నారు. పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూస్తామన్నారు. నూతన పారిశ్రామిక విధానానికి ఈ సమావేశంలో తుదిరూపు ఇవ్వనున్నారు. జూన్ 7న నూతన పారిశ్రామిక విధానం ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నూతన పరిశ్రమల ఏర్పాటుకు 15రోజుల్లోనే అనుమతులు ఇస్తామన్నారు. పరిశ్రమలకు నీటి కొరత లేకుండా చూస్తామని హావిూ ఇచ్చారు. ఇదిలావుంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను సినీ హీరో అల్లరి నరేష్ కలిశారు. ఈ సందర్భంగా తన వివాహానికి రావాలని
కేసీఆర్‌కు నరేష్ విజ్ఞప్తి చేశారు. అల్లరి నరేష్ వివాహం ఈ నెల 29న మదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్ ఫంక్షన్ హాలులో జరగనుంది. నరేష్ విరూపను వివాహమాడనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం అయ్యారు.