నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలి
సారంగపూర్ (జనంసాక్షి ): సెప్టెంబర్ 26
నూతన పార్లమెంటు భవనానికి ప్రపంచ మేధావి, భారతరత్న, భారతరాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని జగిత్యాల జిల్లా మాజీ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ మెంబర్ ఎండబెట్ల ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా వారు ఈ ప్రకటనలో ఈవిధంగా అన్నారు భారత దేశంలో ప్రజలందరికీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిదాయకమని కావున భారత నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరును పెట్టాలని అన్నారు. భారత దేశంలో బడుగు బలహీన వర్గాలకు పేదలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని ప్రపంచం మొత్తం గుర్తించి అతని ఉన్నతమైన మేధస్సుకు ప్రపంచ జ్ఞాని, విశ్వరత్న అని ఎన్నో దేశాలు అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకున్నాయని గుర్తు చేశారు. ప్రపంచం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను గుర్తించిందని మన దేశంలో రాష్ట్రల ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ ను కుల మతాలకు అతీతంగా ప్రజల అందరి మన్ననలు పొందిన మహా జ్ఞాని, మహోన్నత వ్యక్తి , అందరికీ స్ఫూర్తిదదాయకం అయినటువంటి వ్యక్తి డాక్టర్ బీ.ఆర్ అంబేడ్కర్ కాబట్టి ఆయన పేరును రాష్ట్రంలోని అన్ని సచివాలయ కు మరియు భారత పార్లమెంటుకు పెట్టి ముందు వచ్చే తరాలకు ఎంతో స్ఫూర్తిగా అంబేద్కర్ ను తీసుకునే విధంగా చేయాలని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకుని వెళ్ళే విధంగా ప్రజాప్రతినిధులు రాజ్యాంగ బద్ధంగా ప్రజలకు సేవ చేయాలని అన్నారు. భారత రాజ్యాంగం ద్వారా ప్రజలందరికీ సమాన న్యాయం చేసే విధంగా మరియు పేద ప్రజలకు అండగా ఆర్థిక అభివృద్ధికి , సమాజసేవకు తోడ్పాటునందించే దిశగా అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వాల ప్రజాప్రతినిధులు ఉండాలన్నారు.