నెక్లెస్‌రోడ్‌పై తెలంగాణ ‘మార్చ్’కు సర్కారు అనుమతి..
హైదరాబాద్: ఎట్టకేలకు సర్కారు దిగివచ్చింది..దిగిరాక తప్పని పరిస్థితులను తెలంగాణ ప్రజలు ప్రభుత్వానికి కల్పించారు..తెలంగాణ జేఏసీ ఒత్తిడి, తెలంగాణవ్యాప్తంగా ప్రజల నిరసన ప్రదర్శనలు, ఉద్యోగుల ర్యాలీలు..ఇవీ గత కొన్ని రోజులుగా తెలంగాణ మార్చ్‌కు మద్ధతుగా తెలంగాణవ్యాప్తంగా జరుగుతున్న తంతు..దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు…ఎట్టకేలకు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డులో తెలంగాణ కవాతు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది… మధ్యాహ్నం మూడున్నర గంటలనుంచి రాత్రి 7 గంటలవరకు కవాతుకు అనుమతించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ప్రభుత్వ ప్రకటన విడుదల చేసింది…కవాతు వేదిక, అనుమతి విషయమై సాయంత్రం నుంచి రాష్ట్ర మంత్రులకు, తెలంగాణ నేతలకు మధ్య చర్చలు సాగాయి. ట్యాంక్‌బండ్‌పైనే కవాతుకు తొలుత తెలంగాణ నేతలు పట్టుపట్టగా ఘట్‌కేసర్ లేదా పరేడ్ మైదానంలో కవాతుకు అనుమతిస్తామని సీఎం సూచించారు. అబిడ్స్‌నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కవాతును అనుమతి ఇవ్వాలని ఐకాస నేతలు కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కవాతు నిర్వహిస్తామని ఐకాస నేతలను ప్రభుత్వం రాతపూర్వక హామీ కోరింది. ట్యాకుబండ్‌పై కవాతుకు అనుమతిస్తే హామీ ఇస్తామని ఐకాస నేతలు పేర్కొన్నారు. దత్తాత్రేయ, ఈటెల, నాగం చుక్కారామయ్య సహా పలువురు నేతలు సీఎం ప్రతిపాదనపై చర్చలు జరిపారు…దీంతో ప్రభుత్వం మార్చ్‌కు అనుమతిచ్చింది…ఇది ఉద్యమ విజయమని, తెలంగాణ ప్రజలు సర్కారు మెడలు వంచారని తెలంగాణ నేతలు పేర్కొన్నారు..ప్రభుత్వం అనుమతిచ్చింది కావున మార్చ్‌లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు..