నెన్నెలలో స్వయం పాలన దినోత్సవం.
ఫోటో: విద్యార్థులతో ఉపాద్యాయులు.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 7, (జనంసాక్షి)
బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో బుధవారం స్వయం పాలన దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులై తమ తోటి విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పించారు. విద్యార్థుల్లో ప్రతిభాపాటవాలు వెలికితీసేందుకు స్వయం పాలన దినోత్సవం ఎంతగానో ఉపయోగపడుతుందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటేష్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు వనజ, ఉమ, తదితరులు పాల్గొన్నారు.