నెలాఖరుకు అక్రిడిటేషన్లు
– ప్రెస్ అకాడమీ చైరమన్ అల్లం నారయణ
హైదరాబాద్,జూన్24 (జనంసాక్షి):
తెలంగాణలో విలేకరులకు మూడు దశలుగా అక్రిడేషన్లు ఇవ్వనున్నట్లు తెలంగాణ ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. ఈ దఫా డెస్క్‌లో పనిచేసే విలేకరులకూ అక్రిడేషన్ కార్డులు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు. పాత అక్రిడేషన్లు ఉన్నవారికి ఈ నెల 30 లోగా కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. విలేకరులకు, డెస్క్ జర్నలిస్టులకు మూడు దశల్లో అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని ప్రెస్ అకాడవిూ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. అక్రిడేషన్ కార్డుల జారీపై అక్రిడేషన్ కార్డుల కమిటీ అల్లం నారాయణ అధ్యక్షతన భేటీ అయింది. ఈ సందర్భంగా అక్రిడేషన్ కార్డుల జారీ విధానాలపై చర్చించారు. ఈ దఫా డెస్క్‌లో పని చేసే జర్నలిస్టులకూ అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇస్తామని తెలిపారు.