నెహ్రూకు ఘన నివాళులుల

joavkvms

భారత తొలి ప్రధాని జవహర్‌ లాల్ నెహ్రూ125 వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. బాలల చాచాగా గుర్తింపు పొందిన నెహ్రూ జయంతిని వైభవంగా నిర్వహించారు. నెహ్రూ సమాధి శాంతివన్‌ ను పూలతో అందంగా అలంకరించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హామీద్‌ అన్సారీ లు నెహ్రూ సమాధి వద్ద నివాళ్లర్పించారు.

కాంగ్రెస్ ప్రెసిడెంట్‌ సోనియా గాంధీ, వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలు నెహ్రూ సమాధి వద్ద నివాళ్లర్పించారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాలను తిలకించారు. దేశానికి నెహ్రూ అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సైతం నెహ్రూ సమాధి వద్ద నివాళ్లర్పించారు. దేశాభివృద్ధికి నెహ్రూ మార్గదర్శకత్వం ఎంతో ఉపయోగపడిందన్నారు. భారత్ కు అవసరమైన విధంగా మిశ్రమ ఆర్థిక వ్యవస్థను నెహ్రూ పాటించటం సరైన చర్యని చెప్పారు. అటు కాంగ్రెస్ నేతలంతా నెహ్రూ సమాధి వద్ద నివాళ్లర్పించారు.
ఇక బాలల చాచాగా ప్రఖ్యాతి గాంచిన నెహ్రూ కు నివాళ్లర్పించేందుకు భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు సంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బాలలు నెహ్రూ వేషాధారణతో ఆకట్టుకున్నారు.