నేటి నుంచి గనులపై తెబొగకాసం ఆందోళనలు
శ్రీరాంపూర్: కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం చాలాకాలంగా నిర్లక్ష్యం వహిస్తుండటాన్ని నిరసిస్తూ తెబొగకాసం ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి 25వరకు గునులపై ఆందోళనలు చేపట్టుతున్నట్లు సంఘం కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దపల్లి కోటిలింగం, ఏరియా ఉపాధ్యక్షుడు బంటు సారయ్య పేర్కొన్నారు. బుధవారం వారు శ్రీరాంపూర్‌లో మాట్లాడుతూ 2012-13సంవత్సరానికి కంపెనీ సాధించిన లాభాల్లో 25శాతం వాటాను కార్మికులివ్వాలని డిమాండ్ చేశారు. వారసత్వ ఉద్యోగాలు పునరుద్దరించి, కోలిండియా మాదిరిగా క్యాటగిరీ క్యాడర్ స్కీమ్‌ను అమలు చేయాలన్నారు. అప్మెల్ కంపెనీతో ఒప్పందాన్ని రద్దుచేసుకొని సింగరేణిలో వర్కుషాపులను పునరుద్దరించాలన్నారు. నూతన భూగర్భ గనులను తవ్వి, పెండింగ్ ఉన్న డిపెండెంట్స్‌కు ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. మూడు రోజుల ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా 23 గునులపై నల్లబ్యాడ్జీలతో నిరసనలు, 24న అన్ని గునుల్లో డిపార్టుమెంట్‌లపై ఆందోళనలు, వినతి పత్రాలు సమర్పణ, 25న ఏరియాలోని జీఏం కార్యాలయల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్లు వివరించారు. సమావేశంలో తెబొగకాసం ఏరియా కార్యదర్శి కానుగంటి చంద్రయ్య చర్చల ప్రతినిధులు సురేందర్‌రెడ్డి, బుస రమేస్, శేషగిరిరావు, ముక్కెర రమేష్ తదితరులు పాల్గొన్నారు.



