నేటి నుంచి జీహెచ్‌ఎంసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ

5హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయింది. నేటి నుంచి 17 మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. జనవరి 18న నామినేషన్ల పరిశీలన జరుగనుంది. 21న నామిషనేషన్ల ఉపసంహరణ ఉంటుంది. నామినేషన్ల ను స్వీకరించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గ్రేటర్ ఐదు జోన్లు, 24 సిర్కళ్లు, 150 వార్డులున్నాయి. గ్రేటర్ లోని ప్రతివార్డుకు ఒక రిటర్నింగ్ అధికారిని కేటాయించారు.
అడిక్ మెట్ రిటర్నింగ్ అధికారి..
అభ్యర్థితోపాటు ఇద్దరు వ్యక్తుల కార్యాలయంలోకి రావాలి. నామినేషన్ ఫామ్ తోపాటు ఒక అఫిడవిట్ ఇవ్వాలి. ఎన్నికల ఖర్చులకు సంబంధించి కొత్తగా ఓపెన్ చేసిన అకౌంట్ పత్రాను సమర్పించాలి. జనరల్ అభ్యర్థులకు 5 వేల రూపాయలు, రిజర్వేషన్ అభ్యర్థులు 2500 ఇవ్వాలి. అయితే రిజర్వేషన్ అభ్యర్థులు డిక్లరేషన్ ఇవ్వాలి.  డబ్బులను చలాన రూపంలోనైనా నేరుగా అయినా ఇవ్వవచ్చు. అడిక్ మెట్, రాంనగర్, బోలక్ పూర్, కావాడీగూడలో రిటర్నింగ్ అధికారులను కేటాయించామని.. అన్ని ఏర్పాట్లు చేశామని డిప్యూటీ కమిషనర్ ముకుందరెడ్డి తెలిపారు.
ముషీరాబాద్ రిటర్నింగ్ అధికారిణి 
ముషీరాబాద్ ను బిసి జనరల్ కు కేటాయించారు. అభ్యర్థి అఫిడవిట్ సబ్ మిట్ చేయాలి. ఎలాంటి కేసులు లేవని డిక్లరేషన్ ఇవ్వాలి. అభ్యర్థితోపాటు ఇద్దరికి అనుమతి ఉంటుంది.