నేటి నుంచి స్కూల్‌ కాంప్లెక్స్‌ శిక్షణ

కడప, జూలై 28 : జిల్లాలో ఆరు క్లస్టర్‌ కేంద్రాల్లో మూడు రోజుల పాటు ఉపాధ్యాయులకు కాంప్లెక్స్‌ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖ అధికారి ఆంజయ్య శనివారం నాడు తెలిపారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ఈ శిక్షణ తరగతులు జరుగుతాయని అన్నారు. జిల్లాలో 272 స్కూల్‌ కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయుల, సహాయ కార్యదర్శులు ఉపాధ్యాయులు హాజరు కావాలని అన్నారు. కాల్‌ లేటర్లు అందుకున్న వారందరూ హాజరయ్యేలా అన్ని మండల విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.