నేటి నుండి ఇంటింటికి మొక్క నాటే కార్యక్రమం

నిజామాబాద్‌,అక్టోబర్‌ 20 : వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో మంచిప్ప గ్రామంలో ఈ నెల 21న ప్రతి ఇంటింటికొక మొక్కను నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు  ఆ సంఘం కార్యదర్శి సిద్దార్థ తెలిపారు. మంచిప్ప గ్రామంలో గల సమస్యలను పరిష్కరించి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపించాలనే ఉద్దేశ్యంతో యువకులందరూ కలిసి వివేకానంద యువజన సంఘం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని, ఈ నిర్ణయాన్ని గ్రామాభివృద్ధి కమిటీకి తెలిపినప్పుడు వారు కూడా యువజన సంఘంతో కలిసి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో తమ సహాయ సహకారాలుంటాయని చెప్పడం జరిగిందన్నారు. వివేకానంద యువజన సంఘం ఏర్పడిన తర్వాత గ్రామంలో స్వచ్చమైన వాతావరణం అందించాలనే ఉద్దేశ్యంతో మొదటి కార్యక్రమంలో ఈ నెల 21న ఉదయం 10.30 గంటలకు ప్రతీ ఇంటికో మొక్కను నాటి వాటి సంరక్షణకు ఆ ఇంటి యాజమానితో యువజన సంఘం కార్యకర్త బాధ్యత తీసుకోవడం జరుగుతుందన్నారు. గ్రామానికి గల ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటి వాటి సంరక్షణను గ్రామాభివృద్ధి కమిటీ, వివేకానంద యువజన సంఘం చూసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వామి పరిజ్ఞాయానందస్వామి, కలెక్టర్‌ క్రిస్టినా జడ్‌ చొంగ్థు, జిల్లా ఎస్పీవిక్రమ్‌జిత్‌ దుగ్గల్‌, ఎంపిడివో సంజీవ్‌కుమార్‌ తదితరులు హాజరు కానున్నట్లు వివరించారు.

తాజావార్తలు