నేటి నుండి మూడు రోజులు పాటు యాదగిరిగుట్టలో జరిగే టికేజీకెఎస్ భారీ ప్రదర్శన బహిరంగ సభ విజయవంతం చేయండి

 

 

 

 

 

 

 

 

-వేలాదిగా తరలిరండికల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి యం.వి రమణ
కురవి అక్టోబర్-18 (జనం సాక్షి న్యూస్)
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర 3 వ మహాసభల సందర్భంగా నేటి నుండి మూడు రోజులు పాటు యాదగిరిగుట్టలో జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభను జయప్రదం చేయాలి అని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం.వి  రమణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకల్లుగీత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న  గీతకార్మికులకు గీతన్న బంధు ప్రకటించి,పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని,వృత్తికి ఉపయోగపడే విధంగా ద్విచక్ర వాహనాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఐదు లక్షల కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నారని వీరికి బడ్జెట్లో 5 వేల కోట్ల రూపాయలు కేటాయించి సొసైటీలకు భూమి, కల్లు కు మార్కెట్, నీరా తాటి ఈత ఉత్పత్తుల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అన్నారు.పెన్షన్ 5 వేలకు,ఎక్స్గ్రేషియా పది లక్షలకు పెంచాలని అన్నారు.సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ప్రతిష్టించాలని తదితర  25 డిమాండ్లు పరిష్కారం చేయాలని కోరుతూ యాదగిరిగుట్ట లో జరిగే భారీ సభకు వేలాదిగా తరలి రావాలని ఓ ప్రకటనలో కోరారు. నేటి నుండి మూడు రోజులు రాష్ట్ర మూడవ మహాసభ నిర్వహిస్తున్నామని  దీనికి అన్ని జిల్లాల నుండి సంఘం నాయకులు, ప్రతినిధులు వెయ్యి మంది హాజరవుతారని తెలిపారు.తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర,జిల్లా, మండల,గ్రామాల నాయకులు, కార్యకర్తలు, కుల పెద్దలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు సభకు తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వి రమణ పిలుపునిచ్చారు.