*నేటి యువత అబ్దుల్ కలాం ఆశయాలను సాధించాలి
ఎంపీపీ కవిత*
కోదాడ అక్టోబర్ 15(జనం సాక్షి)
దేశం గర్వించదగిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కోదాడ ఎంపీపీ చింత కవిత రాధారెడ్డి అన్నారు. శనివారం ఆయన జయంతిని పురస్కరించుకొని కిట్స్ కళాశాల యాజమాన్యం విజయీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో కోదాడ పట్టణంలోని గాంధీ పార్క్ లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి తన మేధస్సుతో శాస్త్రవేత్తగా రాణించి మిస్సైల్ మ్యాన్ గా పేరు ఉంది భారతదేశాన్ని శాస్త్ర సాంకేతిక రంగాలలో ముందించిన వ్యక్తి కలాం అని అన్నారు రాష్ట్రపతిగా ఎదిగి అన్ని వర్గాల ప్రజల మన్ననాలను అందుకొని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలాం అని అన్నారు. విద్యార్థులు యువతరానికి స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. నేటి యువత వారి ఆశయాల సాధన కొరకు కృషి చేయాలి అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, విశ్రాంత అధ్యాపకులు కవచం వెంకటేశ్వర్లు, భరతారావు, రావెళ్ళ సీతారామయ్య, కిట్స్ కళాశాల చైర్మన్ నీల సత్యనారాయణ, స్వర్ణ భారతి ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీనివాసరావు, విజయీ బావా ట్రస్ట్ అధ్యక్షులు చారు గండ్ల రాజశేఖర్, ఇరుకుల్లా చెన్నకేశవరావు, పోతుగంటి నాగేశ్వరరావు, పైడిమర్రి సత్తిబాబు, చల్లా ప్రకాశరావు, పందిరి సత్యనారాయణ, ముక్తేశ్వరరావు, యాద సుధాకర్, రహీం, గుడు గుంట్ల సాయి ,బత్తుల ఉపేందర్, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
Attachments area