నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష

న్యూఢిల్లీ : పరపతి విధాన సమీక్షలో కీలక విధాన రేటును అర శాతం తగ్గించాలని రిజర్వు బ్యాంకుపై బత్తిడి పెరుగుతోంది. వృద్ధిరేటుకు ఇవ్వడానికి నగదు లభ్యత సమస్యను కూడా పరిష్కరించాలని బ్యాంకులు, ఇతర వర్గాలు కోరుతున్నాయి. రెపో రేటును అర శాతం తగ్గించాల్సిన అవసరం ఉందని స్టేట్‌ బ్యాంక్‌ అఫ్‌ ఇండియా (ఎన్‌బీఐ) ఛైర్మన్‌ ప్రతీప్‌ చౌధురి తెలిపారు. ‘రెపో రేటు, నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)లను అరశాతం చొప్పున తగ్గించమని మేం కోరాం. ఎగుమతి రుణాల రిఫైనాన్సింగ్‌ను పెంచాలని కూడా సూచించాం’ అని ఛౌదురి పేర్కొన్నారు. ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్‌ సి. రంగరాజన్‌, ముఖ్య ఆర్థి క సలహాదారు రఘురామ్‌ రాజన్‌లు కూడా కీలక రేటును తగ్గించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మంగళవారం జరగనున్న పరపతి విధాన సమీక్షలో రిజర్వు బ్యాంకు కీలక విధాన రేటును పావు శాతం తగ్గించలగదని రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనా వేస్తోంది. ఆర్థికవేత్తలు, హెచ్‌ఎన్‌బీసీ, క్రెడిట్‌ సూయిజ్‌, బార్‌క్లేన్‌ వంటి విదేశీ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకులు సైతం రెపో రేటును పావు శాతం తగ్గొచ్చని అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణం కొద్దిగా ఉపశ మించినందున వృద్ధిరేటుపై దృష్టి మళ్లించే వీలుందని అంటున్నాయి. కాగా నగదు అభ్యత అంశాన్ని రిజర్వు బ్యాంకు గవర్నరుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని ఆర్ధిక మంత్రి చిదంబరం అన్నారు.