నేడు ‘ఇందిరమ్మ బాట’ను ప్రారంభించనున్న సీఎం

రాజమండ్రి:సంక్షేమ పథకాల అమలుతీరు పరిశీలను,క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే కార్యక్రమం ఇందిరమ్మ బాటను ముఖ్యమంత్రి నేడు తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు.శనివారం నుంచి మూడు రోజులపాటు సీఎం జిల్లాలో పర్యటించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.మొదటిరోజు పర్యటన అంతా ఏజెన్సీలోనే సాగుతుంది.

ఉదయం 10.40 గంటల&ఎ మదురపూడి విమానాశ్రయానికి చేరుకుంటారు విమానాశ్రయం నుంచి బుల్లేట్‌ బస్సులో 11.10గంటలకు గోకవరం చేరుకుంటారు

ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని గోకవరంలో పరిశీలించి 104,108 వాహనాలను పరిశీలిస్తారు

కృష్ణానిపట్నం అక్కడ ఉపాది హమీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడుతారు.మధ్యాహ్నం 2.40 గంటలకు కృష్ణుపట్నం నుంచి హెలికాప్టర్‌ రంపచోడవరం చేరుకుంటారు.మద్యాహ్నం 3గంటలకు రంపచోడవరం నుంచి రోడ్డుమార్గంలో భూపతిపాలెం ప్రాజెక్టుకు చేరుకుని దాన్ని ప్రారంబించనున్నారు.

సాయంత్రం 4గంటలకు భూపతిపాలెం ప్రాజెక్టు నుంచి రోడ్డుమార్గంలో పెదగంట్యాడ గిరిజన తంగాకు చేరుకుని గిరిజనులతో మాట్లాడుతారు.

సాయంత్రం 5గంటలకు ముసుకుమిల్లి గిరిజన ఆశ్రమ పాఠశాల వద్ద రైతులతో సమావేశమవుతారు.