నేడు ఇందిరాపార్కు వద్ద సీపీఐ మహాధర్నా

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రాన్ని వెంటనే ప్రకటించాలని కోరుతూ సీపీఐ నేడు ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపట్టనుంది. ఉదయం 11 గంటలకు జరగనున్న ధర్నాలో సీపీఐతోపాటు తెరాస, తెదేపా, రాజకీయ ఐకాస పాల్గొననున్నాయి. కాంగ్రెస్‌, భాజపాలను సీపీఐ ఆహ్వానించలేదు, ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి హాజరుకానున్నారు.