నేడు ఎయిడ్స్ అవగాహన ర్యాలీలు
హైదరాబాద్,నవంబర్30(జనంసాక్షి): ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో అనేక క ఆర్యక్రమాలు చేపట్టారు. ఎయిడ్స్ అవగాహన ర్యాలీలు చేపట్టనున్నారు. అవగాహనతోనే ఎయిడ్స్ దూరం చేయవచ్చన్నారు. ఎయిడ్స్‌తో బాధపడుతున్న వారిని ఆదరించాలని, ఈ వ్యాధిపై ప్రజల్లో
మరింత అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్ర యూఎస్ కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా అన్నారు. ఎయిడ్స్ బాధితులు రోజురోజుకు తగ్గుతున్నారని 2020 నాటికి 90శాతం తగ్గించాలన్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు అన్ని సంస్థలు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నివారణ సంస్థ టీసాక్స్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ బ్లడ్ బ్యాంక్‌లో రక్త సమాచారాన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెస్తామని ఎయిడ్స్ సంస్థ అధికారులు అన్నారు.