నేడు ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఆదిలాబాద్‌,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గాన్ని 23న ఎన్నుకుంటారు.

ఈనెల 23న నిర్వహించే 7వ ఏఐటీయూసీ జిల్లా మహాసభలను మంగళవారం నాడిక్కడ నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంటారు. ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని

టీఎన్జీఓస్‌ ¬మ్‌లో సభలను నిర్వహిస్తున్నారు. ఉదయం 10 గంటలకు ఆర్‌ అండ్‌ బీ విశ్రాంతి భవనం నుంచి ర్యాలీ, 11 గంటలకు బహిరంగ సభ, మధ్యాహ్నం ఒంటి గంటలకు ప్రతినిధుల సభలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. కార్మికులను రాజకీయంగా చైతన్యపర్చి భవిష్యత్తు పోరాటాలకు సన్నద్ధం
చేయడమే మహాసభల ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలోని అన్ని రంగాలు, వివిధ సంఘాల కార్మికులు పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు టి.నర్సింహన్‌, ఆటో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి.వెంకటేశం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుండా మల్లేశ్‌
హాజరవుతున్నారని పేర్కొన్నారు. దీనిని విజయవంతం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కె.రాములు కోరారు.