నేడు కరీంనగర్‌కు రానున్న కేటీఆర్
తొలి సవిూక్షా సమావేశం ఇక్కడి నుంచే
భారీగా ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు
కరీంనగర్,మార్చి5(జనంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్ వ్యూహాత్మక అడుగుల వేస్తోంది. ఇందులో భాగంగా 6నుంచి సవిూక్షా సమావేశాలు ఏర్పాటు చేసింది.
టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ అధ్యక్షుడి ¬దాలో మొదటిసారిగా కేటీఆర్ కరీంనగర్ జిల్లాకు వస్తున్నారు. కనీవినీ ఎరుగని రీతిలో స్వాగతం పలకడానికి శ్రేణులు సిద్దం అవుతున్నాయి. అలాగే సమావేవానికి భారీగా ఏర్పాట్లు చేశారు. టీఆర్‌ఎస్ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి ప్రతి నియోజకవర్గ పరిధి నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలను తరలిరావాలని ఇప్పటికే కోరారు. ఈ సమావేశానికి 25 వేలకు పైగా కార్యకర్తలను తరలించాలని సూచించారు. సన్నాహక సమావేశంలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పని చేసేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేస్తారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో
కార్యకర్తల కృషి వల్లే ఈ స్థాయి విజయం సాధ్యమైందని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ఇప్పటికే నుంచే సిద్ధం కావాలన్నారు. కరీంనగర్ నుంచి అత్యధిక మెజార్టీ సాధించాలన్నారు. అనుకున్న సమాయానికి సమావేశానికి రావాలన్నారు. సమావేశానికి వచ్చే నాయకులు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. కరీంనగర్ నుంచి ఏ కార్యక్రమం తీసుకున్నా విజయవంతం అవుతుందనీ, అదే తీరులో ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలన్నారు. ఆది నుంచి పార్టీకి జిల్లా అండగా నిలిచిందని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా లోక్‌సభ ఎన్నికల్లో అదే తీరులో పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో 16 ఎంపీ స్థానాలు గెలుచుకుంటే కేంద్రంలో కీలకపాత్ర పోషించేందుకు అవకాశం ఉందని మంత్రి ఈటెల తెలిపారు. ఇదే ఆలోచనతో సీఎం కేసీఆర్ ముందుకు సాగుతున్నారనీ, కార్యకర్తలు కూడా అదే లక్ష్యంతో పని చేయాలన్నారు. ఈ సన్నాహక సమావేశానికి ప్రతి నియోజకవర్గం నుంచి కార్యకర్తలను తరలిచేందుకు నియోజకవర్గాలవారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించినట్లు చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గ బాధ్యతలను ఈద శంకర్‌రెడ్డికి, హుస్నాబాద్‌కు జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మానకొండూర్‌కు కోడూరి సత్యనారాయణగౌడ్, కరీంనగర్‌కు నారదాసు లక్ష్మణ్‌రావు, చొప్పదండికి చెన్నాడి సుధాకర్‌రావు, సిరిసిల్లకు పేర్యాల రవీందర్‌రావు, వేములవాడకు అక్బర్‌హుస్సేన్‌కు అప్పగించినట్లు తెలిపారు. సమావేశంలో ఎంపీ వినోద్‌కుమార్, పార్టీ జిల్లా ఇన్‌చార్జీ బసవరాజు సారయ్య, సహాయ కార్యదర్శి గూడూరి ప్రవీణ్, మాజీ ఎంపీ వివేక్, జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, వొడితెల సతీశ్‌కుమార్, రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, టెస్కాబ్, ఐడీసీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు కొండూరి రవీందర్‌రావు, ఈద శంకర్‌రెడ్డి, అక్బర్‌హుస్సేన్, లోక బాపురెడ్డి, నగర మేయర్ రవీందర్‌సింగ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్‌రెడ్డి, డిప్యూటీ మేయర్ గుగ్గిళ్లపు రమేశ్, సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.