నేడు కరోనాపై సీఎం ఉన్నత స్థాయి సమీక్ష
ఉన్నాతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసుకమీషనర్లు, ఎస్పీలతో సమావేశం మంత్రులు,
హైదరాబాద్,మార్చి 18(జనంసాక్షి): కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన రాష్ట్ర సర్కార్ నేడు సీఎం కేసీఆర్ అధ్యక్షతన అత్యవసర అత్యున్నత స్థాయి సమావేశం జరగనుంది. ఆ భేటీకి మంత్రులు, ఉన్నతాధికారులతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు హాజరు కానున్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవలసిన చర్యలపై చర్చించేందుకు గు రువారం అత్యవసర, అత్యున్నత రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణ యించారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతి భవన్ లో జరిగే ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్. పిలను ఆహ్వానించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటల రాజేందర్, మున్సిపల్ శాఖ మంత్రి కె.టి. రామారావు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హైదరాబాద్ కు చెందిన మంత్రులు మధ్యాహంలో అన్ని పెంచారు. వైద్యులు మంత్రి శాఖ మంత్రి ఇటలను ఆహ్వానించారు. తెలక్టర్లు, పోలీస్ మహమూద్ అలీ, శ్రీనివాస యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, మున్సిపల్ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లను ఈ సమావేశానికి ఆహ్వానించారు. ఇండోనే షియా నుంచి కరీంనగర్ కు వచ్చిన కొంతమంది విదేశీ యులకు కరోనా లక్షణాలు ఉన్నట్లు తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తంగా వుండాలని ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో తలెత్తిన పరిసి తిని, తీసుకవలసిన జాగ్రత్తలను, పాటించాల్సిన నియం త్రణ పద్ధతులను గురువారం నాటి సమావేశంలో విస్తుతం గా చర్చిస్తారు. విదేశాల నుండి వచ్చిన వారి ద్వారానే కరో నా వైరస్ వ్యాప్తి చెందుతున్నందున ఎట్టి పరిస్థితుల్లోను విదే శాల నుండి వచ్చిన వారు సంపూర్ణ వైద్య పరీక్షలు చేసు కోవాలని కోరారు. ఈ విషయంలో ప్రజలు కూడా అప్ర మత్తమై ప్రభుత్వానికి సమాచారమందించాలని, స్వీయ ఆరోగ్య పరిరక్షణ చర్యలు తీసుకోవాలని సిఎం కోరారు. విదేశాల నుండి వచ్చిన ఎవరినైనా సరే సంపూర్ణ పరీక్షలు జరిపిన తరువాతనే ఇండ్లకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. నేడు కరోనాపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష – మంత్రులు, ఉన్నాతాధికారులు, అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసుకమీషనర్లు, ఎస్పీలతో సమావేశం కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా వుండేందుకు ప్రభుత్వం ఇప్పటికే కొన్ని అంశాల్లో 15రోజుల కార్యాచరణ, మరికొన్ని అంశాల్లో వారం రోజుల కార్యాచరణ ప్రకటించి అమలు చేస్తున్నది. గురువారం జరిగే అత్యవసర, అత్యున్నత సమావేశంలో మరిన్ని నియంత్రణ చర్యలు తీసుకునే అవకాశం వుంది. రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా గుమి గూడే కార్యక్రమాలన్నింటిని రద్దు చేయాలని నిర్ణయించింది. సామూహికంగా జరిగే పండుగలు, ఉత్సవాలకు కూడా దూరంగా వుండాలని ప్రజలకు ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునిచ్చారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకునే చర్యలను ప్రజలు అర్థం చేసుకుని రాష్ట్రాన్ని కాపాడుకోవాలని, జనం ఒకే చోట గుమిగూడవద్దని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.