నేడు గణెళిశ్ నిమజ్జనం
భారీగా ఏర్పాట్లు చేసిన పోలీసులు
ట్రాఫిక్ ఆంక్షలు విధింపు
నేడు ప్రభుత్వ సెలవు
హైదరాబాద్,సెప్టెంబర్4జనంసాక్షి
ఈనెల 5న మంగళవారం నిర్వహించే గణెళిష్ నిమజ్జనం సందర్బంగా పోలీసు అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్, పూర్వపు రంగారెడ్డి జిల్లాల్లో భారీగా బందోబస్తు చేపట్టారు. అందరూ శాంతియూత వాతావరణంలో నిమజ్జనం జరిగేలా చూడాలని నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, రాచకొండ సీపీ మహేష్ భగవత్ సూచించారు. ఇకపోతే నిమజ్జనం మొత్తం సిసి కెమరాల ద్వారా పరిశీలించనున్నారు. మరోవైపు నిమజ్జనం పురస్కరించుకుని మంగళవారం జంటనగరాలు, రంగారెడ్డి జిల్లా పరిధిలో ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రాచకొండ కమిషనరేట్ పరిధిలోని మల్కాజిగిరి, ఎల్బీనగర్, యాదాద్రి జోన్ల పొలిసు అధికారులతో సమావేశము నిర్వహించాచి వారికి తగిన సూచనలు చేశారు. నిమజ్జనం రోజున పోలీసు అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రజలు సహకరించాలని, నిమజ్జన ప్రదేశాల్లో సీసీ కెమెరాతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. నిమజ్జనం కోసం సిద్ధం చేసిన సరూర్‌నగర్ చెరువును సందర్శించారు. నిమజ్జనాన్ని చాలా పకడ్బందీగా నిర్వహించాలని, నిమజ్జనం ప్రాంతంలో మంచినీరు, విద్యుత్ లైట్స్, భారీ క్రేన్స్, వైద్య సిబ్బంది, గజ ఈతగాళ్ళు అందుబాటులో ఉండేవిధంగా చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. బయటి నుండి నిమజ్జనానికి వచ్చిన సిబ్బందికి ఏర్పాట్లు అన్ని విధాలుగా చూసుకోవాలని వారికీ సూచించారు. నిమజ్జనాల ఘాట్ వద్ద ట్రాఫిక్ లేకుండా చూసుకోవాలని సూచించారు. దాదాపుగా మూడు వేల మంది పోలీసు సిబ్బంది తో పటిష్ట బందోబస్ట్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇకపోతే హయత్‌నగర్, ఎల్‌బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, సరూర్‌నగర్ వైపు నుంచి సరూర్‌నగర్ చెరువుకు వచ్చే వినాయక ఊరేగింపు వాహనాలు ఎల్‌బీనగర్ చౌరస్తా, కొత్తపేట, దిల్‌సుఖ్‌నగర్, వెంకటాద్రి థియేటర్ వైపు వచ్చి ఎడమ వైపు మళ్లి.. శివగంగ థియేటర్, శంకేశ్వర్ బజార్ కూడలి వద్ద మళ్లీ ఎడమ వైపు మళ్లించి సరూర్‌నగర్ చెరువు వైపు వెళ్లాలి. చాదర్‌ఘాట్, మలక్‌పేట, మూసారాంబాగ్, అంబర్‌పేట నుంచి వచ్చే వాహనాలు.. మూసారాంబాగ్ చౌరస్తా విూదుగా కోణార్క్ డయాగ్నస్టిక్ సెంటర్ వద్ద యూ టర్న్ తీసుకుని గడ్డిఅన్నారం కూడలి వద్ద ఎడమ వైపు మళ్లించి శివగంగ థియేటర్, శంకేశ్వర్ బజార్ కూడలి విూదుగా తటాకానికి రావాల్సి ఉంటుంది. సైదాబాద్, సంతోష్‌నగర్, ఐఎస్ సదన్, నాగార్జునా నగర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు సింగరేణి కాలనీ, శంకేశ్వర్ బజార్ మార్గంలో వచ్చి చెరువుకు చేరుకోవాలి. నిమజ్జనం ముగిశాక ఖాళీ వాహనాలను కర్మన్‌ఘాట్, సరూర్‌నగర్ తపాలా కార్యాలయం వైపు నుంచి మాత్రమే తీసుకెళ్లాలి. సందర్శకులు తమ వాహనాలను సరూర్‌నగర్ తపాలా కార్యాలయం(మహాత్మాగాంధీ విగ్రహం) సవిూపంలోని జ్యోతి క్లబ్, సరస్వతి శిశుమందిర్, జెడ్‌పీహెచ్‌ఎస్ పాఠశాల వద్ద నిలపాలి. ఇతర ప్రదేశాల్లో పార్కింగ్‌కు అనుమతించరు. సఫిల్ చెరువు, స్వాగత ద్వారం, వెంకటేశ్వర మిఠాయి దుకాణం చెంతకు వెళ్లేందుకు సందర్శకుల వాహనాలను అనుమతించరు. ?ద నేరేడ్‌మెట్ చౌరస్తా, ఆనంద్ బాగ్ చౌరస్తా, సఫిల్‌గూడ రైల్వే స్టేషన్‌ల నుంచి ద్విచక్ర వాహనాలు, ఫోర్ వీలర్ వాహనాలను సఫిల్‌గూడ చెరువు వద్దకు వెళ్లనివ్వరు.
ఆయా కూడళ్లలో ఆంక్షలు అమలు
బైరామల్‌గూడ నుంచి చంపాపేట్, ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్, ఉప్పల్ నుంచి రామంతాపూర్, నేరేడ్‌మెట్ నుంచి సఫీగూడ చెరువు, ఆర్‌కే పురం నుంచి ఈసీఐఎల్(వెర్సా విూదుగా) రహదారుల్లో భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు ఉంటాయి. గడ్డిఅన్నారం నుంచి శంకేశ్వర్‌బజార్, సైదాబాద్ నుంచి సరూర్‌నగర్ చెరువు, ఉప్పల్ రింగురోడ్డు నుంచి రామంతాపూర్, నేరేడ్‌మెట్ నుంచి సఫిల్‌గూడ తటాకం, ఏఓసీ గేట్ నుంచి సఫిల్‌గూడ చెరువు, ఆనంద్ బాగ్ నుంచి సఫిల్‌గూడ చెరువు మార్గాల్లో ఆర్టీసీ బస్సులకూ అనుమతి ఉండదు.