నేడు చంద్రుడి చెంతకు విక్రమ్
` సాయంత్రం 6.04 గంటలకు జాబిల్లిపై అడుగుపెట్టనున్న ల్యాండర్
` కీలకదశకు చేరువైన ప్రయోగం
` ప్రత్యక్ష వీక్షణకు విద్యాసంస్థల్లో ఏర్పాట్లు
` సేఫ్ ల్యాండిరగ్ కోసం కృషిచేస్తోన్న ఇస్రో
` దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా వీక్షించనున్న ప్రధాని మోదీ
` ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ప్రపంచం
` 70 కి.మీ. దూరం నుంచి జాబిల్లి ఫొటోలు పంపిన ల్యాండర్..
బెంగళూరు(జనంసాక్షి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్`3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం విª`రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్`3 సేఫ్ ల్యాండిరగ్‌కు ఇస్రో సర్వం సిద్ధంచేసింది. దీనికోసం యావత్ భారతమేకాదు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధృవంపై సాప్ట్ ల్యాండిరగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషణ కొనసాగిస్తోంది. కాగా, 70 కిలోవిూటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్ లో పోస్టు చేసింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది. మిషన్ షెడ్యూల్‌లో ఉందని.. సిస్టమ్‌లు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొంది. సున్నితమైన సెయిలింగ్ కొనసాగుతోందని తెలిపింది. చంద్రయాన్`3 సేఫ్ ల్యాండిరగ్ ప్రత్యక్ష ప్రసారం సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడిరచింది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాప్ట్‌ల్యాండిరగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో ట్విట్టర్ ద్వారా ఇప్పటికే వెల్లడిరచింది. మరోవైపు చంద్రయాన్`3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా`25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్`3పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్`3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్`3 సేఫ్ ల్యాండిరగ్‌కు ఇస్రో సర్వం సిద్ధంచేసింది. దీనికోసం యావత్ భారతమేకాదు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇలాంటి అపూర్వ ఘట్టం నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లో చంద్రయాన్`3 సేఫ్ ల్యాండిరగ్‌ను విద్యార్థులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. దీనికి సంబంధించి ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డీఈవోలు, ప్రిన్సిపల్స్‌కు ఆదేశాలు జారీచేశారు. బుధవారం సాయంత్రం 5.30 గంటలకు చంద్రయాన్`3 సేఫ్ ల్యాండిరగ్ కానున్నట్లు ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. దీనిని విద్యార్థులు, యువత ప్రత్యక్షప్రసారాల ద్వారా చూడాలని కోరింది. ఈనేపథ్యంలో టీశాట్, నిపుణలో లైవ్ టెలికాస్ట్ చేయనున్నారు. ప్రభుత్వ పాఠశాలు, విద్యా సంస్థల్లో ప్రత్యేక తెరలు, ప్రొజెక్టర్లు ఏర్పాటు చేసి విద్యార్థులంతా చూసేలా విజ్ఞప్తి చేయనున్నారు
70 కిలోవిూటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలు పంపిన ల్యాండర్..
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్`3 ప్రయోగం కీలక దశకు చేరువైంది. అంతా సాఫీగా సాగితే బుధవారం సాయంత్రం చంద్రుడిపై అడుగుపెట్టనుంది. చంద్రయాన్`3 సేఫ్ ల్యాండిరగ్‌కు (ూజీటవ శ్రీజీనిటతినిణ) ఇస్రో సర్వం సిద్ధంచేసింది. దీనికోసం యావత్ భారతమేకాదు ప్రపంచ దేశాలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ప్రస్తుతం చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్ ల్యాండిరగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్ ల్యాండర్ అన్వేషణ కొనసాగిస్తోంది.కాగా, 70 కిలోవిూటర్ల దూరం నుంచి జాబిల్లి ఫొటోలను ల్యాండర్ తన కెమెరాలో బంధించింది. ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్ (ఎక్స్)లో పోస్టు చేసింది. విక్రమ్ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్ హజార్డ్ డిటెక్షన్ అండ్ అవైడెన్స్ కెమెరా ఈ ఫొటోలను తీసినట్లు తెలిపింది. మిషన్ షెడ్యూల్‌లో ఉందని.. సిస్టమ్‌లు క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నట్లు పేర్కొంది. సున్నితమైన సెయిలింగ్ కొనసాగుతోందని తెలిపింది. చంద్రయాన్`3 సేఫ్ ల్యాండిరగ్ ప్రత్యక్ష ప్రసారం రేపు సాయంత్రం 5:20 గంటలకు ప్రారంభమవుతుందని వెల్లడిరచింది.ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ (పతిసతీజీఎ శ్రీజీనిటవతీ) చంద్రుడిపై అడుగుపెట్టనున్న విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ల్యాండిరగ్ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే ఈ సమయంలో మార్పు చేశారు. 17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఇస్రో ట్విట్టర్ ద్వారా ఇప్పటికే వెల్లడిరచింది. మరోవైపు చంద్రయాన్`3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా`25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్`3పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
దక్షిణాఫ్రికా నుంచి ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా వీక్షించనున్న ప్రధాని మోదీ
చంద్రుడిపై పరిశోధనల కోసం ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్` 3 జాబిల్లిపై అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది. గతంలో ఏ దేశమూ కాలుమోపని చంద్రుడి దక్షిణ ధ్రువం విూద చంద్రయాన్ దిగే అపూర్వ ఘట్టాన్ని వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇందుకోసం దేశంలోని అనేక రాష్ట్రాలు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేస్తున్నాయి. అయితే, బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్‌గా కలిసి ఈ మధుర క్షణాలను తిలకించనున్నట్లు అధికార వర్గాలు వెల్లడిరచాయి.ఇస్రో శాస్త్రవేత్తల ప్రణాళిక ప్రకారం.. బుధవారం సాయంత్రం 6.04గంటలకు చంద్రయాన్`3 జాబిల్లిపై (ఒబీనిజీతీ దిగుతుంది. దీన్ని సురక్షితంగా దించేందుకు భారత శాస్త్రవేత్తలు తీవ్ర కృషి చేస్తున్నారు. ఇప్పటివరకు అన్ని వ్యవస్థలను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తున్నామని.. చంద్రయాన్`3 ప్రయాణం సాఫీగా సాగుతోందని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడిరచారు. చంద్రయాన్`3 ప్రయోగంపై అటు మిషన్ ఆపరేషన్స్ కాంప్లెక్స్ (ఓూచీ) కూడా ఎంతో ఉత్సాహంగా ఉందని ఇస్రో వెల్లడిరచింది.జాబిల్లి చుట్టూ 70కి.విూ ఎత్తులో తిరుగుతోన్న సమయంలో తీసిన తాజా చిత్రాలతోపాటు ఆగస్టు 20న ల్యాండర్ ఇమేజ్ కెమెరా4 తీసిన వీడియోను ఇస్రో షేర్ చేసింది. చంద్రుడిపై దిగే మధుర క్షణాలను యావత్ ప్రపంచం తిలకించేందుకు వీలుగా సాయంత్రం 5.20నుంచి లైవ్ టెలికాస్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.
ట్రెండిరగ్‌లో ఇస్రో .. ఆ ట్వీట్‌లూ కారణమే!
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ చేపట్టిన చంద్రయాన్`3 గురించి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎక్స్‌లో ట్రెండిరగ్‌లో చంద్రయాన్`3 ఉన్నాయి. గతంలో ప్రయోగించిన చంద్రయాన్`2 తృటిలో విఫలం కావడంతో చంద్రయాన్`3పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు జాబిల్లి చుట్టూ తిరుగుతున్న చంద్రయాన్`2 ఆర్బిటర్‌తో చంద్రయాన్`3 ల్యాండర్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు ఇస్రో ప్రకటించడం మరింత ఆసక్తిని కలిగించింది. వీటన్నింతోపాటు సామాజిక మాధ్యమాల్లో గతంలో కంటే భిన్నంగా సమాచారాన్ని షేర్ చేస్తుండటం ఎక్కువ మందికి చంద్రయాన్`3పై గురించి తెలుసుకునేందుకు తమ డివైజ్‌ల ముందు కూర్చొబెట్టింది.గతంలో ఇస్రో తమ ప్రాజెక్ట్‌కు సంబంధించిన సమాచారం షేర్ చేసేందుకు ఎక్కువగా సాంకేతిక పదాలను ఉపయోగించేది. కానీ, ఈ సారి మాత్రం ‘వెల్‌కమ్ బడ్డీ’, ‘థాంక్స్ ఫర్ ది రైడ్ మేట్’ వంటి పదాలతో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో సమాచారాన్ని షేర్ చేసింది. సోమవారం చంద్రయాన్`2 ఆర్బిటర్ చంద్రయాన్`3 ల్యాండర్ మాడ్యుల్‌తో అనుసంధానమైందని తెలిపిందుకు ఇస్రో వెల్‌కమ్, బడ్డీ (చివశ్రీఞనీఎవ, పబీటటవ!)అంటూ చేసిన ట్వీట్‌కు కొద్ది సమయంలోనే 3.4 మిలియన్ వ్యూస్ వచ్చాయి. గత వారం ఆగస్టు 17న ప్రొపెల్షన్ మాడ్యుల్ నుంచి విక్రమ్ ల్యాండర్ విడిపోయిన విషయం చెప్పేందుకు థాంక్స్ ఫర్ ది రైడ్, మేట్ అంటూ చేసిన ట్వీట్‌కు రోజు వ్యవధిలో 5.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి.మరోవైపు చంద్రయాన్`3కి సంబంధించి ఇస్రో చేసే ట్వీట్‌లలో చంద్రుడి, రాకెట్, శాటిలైట్ ఎమోజీలతో ట్వీట్‌లు చేయడంతో యూజర్లకు మరింత చేరువ చేశాయి. దాంతోపాటు బుధవారం సాయంత్రం 6:04కు చంద్రుడిపై విక్రమ్ సాఫ్ట్ ల్యాండిరగ్ జరుగుతుందని చేసిన ట్వీట్, ఎంతో మంది సోషల్ విూడియా యూజర్లకు చంద్రయాన్`3పై ఆసక్తిని పెంచింది.
ఇదొక గొప్ప అడుగు.. ఆసక్తిగా ఎదురుచూస్తున్నా: సునీతా విలియమ్స్
చంద్రయాన్` 3 మిషన్ కీలక దశకు చేరుకున్న వేళ.. జాబిల్లిపై ‘విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే క్షణాల కోసం అంతా ఎదురుచూస్తున్నారు.దేశ, విదేశాల్లోనూ ఈ ఘట్టంపై ఉత్కంఠ నెలకొంది. తాను కూడా ఈ ఈవెంట్ కోసం ఎంతో ఉత్సాహంగా, ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. అంతరిక్ష పరిశోధన రంగంలో భారత్ పురోగతిని కొనియాడుతూ.. చంద్రయాన్` 3 ప్రయత్నాన్ని ఒక గొప్ప అడుగుగా అభివర్ణించారు. చంద్రుడిపై పరిశోధనలు కేవలం విజ్ఞానానికే పరిమితం కాదని, భూమికి ఆవల స్థిరమైన నివాస అవకాశాలనూ అన్వేషిస్తాయని ఓ టీవీ ఛానెల్‌తో అన్నారు.’చంద్రుడిపై ల్యాండిరగ్.. మనకెంతో అమూల్యమైన సమాచారాన్ని అందిస్తుంది. అంతరిక్ష పరిశోధనలు, జాబిల్లిపై స్థిర నివాసం అన్వేషణల విషయంలో భారత్ ముందంజలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవి నిజంగా ఉత్తేజకర క్షణాలు. చందమామపై ల్యాండర్, రోవర్ శాస్త్రీయ పరిశోధనల ఫలితాల విషయంలో ఎంతో ఉత్సుకతతో ఉన్నా, చంద్రుడిపై అన్వేషణలకు సంబంధించి ఇదొక గొప్ప అడుగు కానుంది’ అని సునీతా విలియమ్స్ పేర్కొన్నారు. ‘చంద్రయాన్` 3’ పరిశోధనల సామర్థ్యాన్ని ప్రస్తావిస్తూ.. ఇది చంద్రుడి దక్షిణ ధ్రువంపై స్థిరమైన మానవ నివాసాలను స్థాపించేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించడంలో సహాయపడుతుందని చెప్పారు.ఇదిలా ఉండగా.. కల్పనా చావ్లా తర్వాత అంతరిక్షంలో వెళ్లిన భారత సంతతికి చెందిన రెండో మహిళగా సునీతా విలియమ్స్ ఖ్యాతి గడిరచిన విషయం తెలిసిందే. మరోవైపు.. చంద్రుడిపై ప్రయోగాల కోసం ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్`3 బుధవారం సాయంత్రం జాబిల్లిపై అడుగుపెట్టనుంది. ఈ అపురూప ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఇస్రో ఏర్పాట్లు చేసింది.