నేడు జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): ఈనెల 26న శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు జరుగున్నాయి. ఉదయం 9గంటలకు ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.ఎ.రవీందర్‌రెడ్డి తెలిపారు. సైన్సు ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న ఆయా పాఠశాలల విద్యార్థులు గైడ్‌టీచర్లు సకాలంలో హాజరుకావాలని పేర్కొన్నారు. ఒక ప్రాజెక్టు సంబంధించి ఫాం-ఎ, గ్రూప్‌ లీడర్‌ పాస్‌పోర్ట్‌సైజు ఫోటో, ఒరిజినల్‌ రైటప్‌తో పాటు ఒక జిరాక్సు కాపీ, నాలుగు చార్టులు మాత్రమే తీసుకురావాలని సూచించారు. ఒక పాఠశాల నుంచి రెండు అంతకంటే ఎక్కువ ప్రాజెక్టులు ఉంటే ఒక గైడ్‌టీచరు, ప్రాజెక్టుకు ఒక గ్రూపులీడరు మాత్రమే రావాలని పేర్కొన్నారు. సైన్స్‌ ప్రాజెక్టులతో సిద్ధంగా ఉన్న వివిధ పాఠశాలల విద్యార్థినీ విద్యార్థులు గైడ్‌ టీచర్లను సకాలంలో స్థానిక కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం పక్కన ఉన్న గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలకు తీసుకరావాల్సిందిగా సూచించారు. ఒక్కోక్క ప్రాజెక్టుకు ఒక గైడ్‌ ఉపాధ్యాయుడు ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు మాత్రమే హాజరు కావాలని తెలిపారు.