నేడు నిజామాబాద్‌లో..
మంత్రి కేటీఆర్ పర్యటన
– బైపాస్‌లో ఐటీ హబ్ శంకుస్థాపన చేయనున్న మంత్రి
నిజామాబాద్, జులై31(జనం సాక్షి) : రాష్ట్ర ఐటీ, పురపాలక, మైనింగ్ శాఖల మంత్రి కేటీఆర్ బుధవారం నిజామాబాద్ జిల్లాకేంద్రంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. బుధవారం ఉదయం 10గంటలకు నగర శివారులోని హైదరాబాద్ రోడ్డులో గల బృందావనం గార్డెన్ వద్ద మంత్రి కేటీఆర్‌కు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి బైక్ ర్యాలీతో నగరానికి తీసుకువస్తారు. ఉ.10.30గంటలకు దుబ్బ బైపాస్‌లో ఐటీ హబ్‌కు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం 10.45 గంటలకు పాలిటెక్నిక్ గ్రౌండ్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. రూ.300 కోట్లతో చేపట్టిన పనులకు సంబంధించిన పైలాన్‌ను 12.30గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలోని పార్కులో ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పూలాంగ్ బ్రిడ్జి వద్ద రూ.90 కోట్లతో చేపడుతున్న అమృత్ పథకానికి సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. 1.15 గంటలకు నాగారంలో నిర్మాణంలో ఉన్న 400 డబుల్ బెడ్‌రూం ఇండ్లను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.30గంటలకు నాగారంలో 1,000 డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేస్తారు.
1.45గంటలకు సుభాష్‌నగర్‌లో నూతనంగా నిర్మించిన అర్బన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 2గంటలకు చంద్రశేఖర్ కాలనీ( బైపాస్ రోడ్డు)లో టీఎన్‌జీవోస్ ఆధ్వర్యంలో చేపట్టే హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మొక్కలు నాటుతారు. అనంతరం తిరిగి మంత్రి హైదరాబాద్ పయణమవుతారు.