నేడు నిర్వాసితుల సమావేశం రేపు
కరీంనగర్,ఫిబ్రవరి17 (జనంసాక్షి) : లోయార్ మానేర్ డ్యామ్ భూ నిర్వాసితులతో 18న స్థానిక అంబేడ్కర్ భవన్‌లో సమావేశం ఏర్పాటు చేసినట్లు ముంపు గ్రామాల సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు. అర్హులైన భూ నిర్వాసితులకు ఇప్పటికీ ఉద్యోగాలు రాలేదని, భూ పరిహారం ఇంకా అందని వారు ఉన్నారని చెప్పారు. అన్ని సమస్యలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నందున సమావేశానికి బాధితులంతా హాజరుకావాలని కోరారు. సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని అన్నారు.