నేడు నులి పురుగుల నివారణ మాత్రల పంపిణీ – ప్రభుత్వ వైద్యులు డాక్టర్ అశోక్ కుమార్

 

జనంసాక్షి, కమాన్ పూర్ :
జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమాన్ని నేడు గురువారం నిర్వహించనున్నట్లు పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా 1-19 సం॥రాల పిల్లలందరికీ ఆబెండజోల్ మాత్రలు వేయడం జరుగుతుందని, మండలంలోని అన్ని అంగన్వారీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు కళాశాలల యందు పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయడం జరుగుతుందని తెలిపారు. 20వ తేదీ గైర్హాజరయి నటు వంటి పిల్లలకు 27వ తేదీన
మా మాప్ కార్యక్రమం ద్వారా ఆరెండజోల్ మాత్రలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని మండలంలోని 1-19 సం॥రాల పిల్లలందరూ వినియోగించుకోవాలని డాక్టర్ అశోక్ కుమార్ పిలుపునిచ్చారు.