నేడు పాలిటెక్నిక్‌ ఎంట్రెన్స్‌

జనగామ,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఈనెల 21న పాలి టెక్నిక్‌ ఎంట్రెన్స్‌ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఉదయం 11నుంచి 1గంట వరకు జిల్లా కేంద్రంలో పరీక్ష ఉంటుంది. ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, ఏకశిల డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్‌ కళాశాల(బాలుర), టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌ జూనియర్‌ కాలేజీ(బాలుర), టీటీడబ్ల్యూఆర్‌ డిగ్రీ కళాశాల(బాలికల)లో పరీక్షలు నిర్వహిస్తారు. విద్యార్థులను ఉదయం 11గంటలలోపే పరీక్ష హాల్‌కు అనుమతిస్తామని స్పష్టంచేశారు. దరఖాస్తు చేసుకున్న వారు ముందుగానే సెంట్లర్లకు చేరుకోవాల్సి ఉంటుంది.