నేడు ప్రపంచ చాక్లెట్‌ దినోత్సవం

ఏటా జూలై 7న నిర్వహిస్తున్న ప్రపంచం

విజయవాడ,జూలై7(జనం సాక్షి): చాక్లెట్‌ పేరు వింటే చాలు అందరి నోట్లో నీరూరుతుంది. చిన్న పిల్లలతో మొదలుకొని వయోధికుల వరకూ అందరూ చాక్లెట్ను ఇష్టపడతారు. ఏ షాపుకు ఎక్కడికి వెళ్లినా దర్శనమిస్తుంది. చాక్లెట్‌ చప్పరించడం ద్వారా మనోల్లాసంతోపాటు అద్భుతమైన ఆరోగ్యాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తేల్చి చెప్పారు. ఐరోపాలో చాక్లెట్‌ పానీయం గురించి 1520 సంవత్సరం నుండి తెలుసు. యూరోపియన్లకు చాక్లెట్‌ అంటే తెగ ఇష్టం. ప్రపంచం మొత్తంలో సగం చాక్లెట్ల వినియోగం ఐరోపాలోనే జరుగుతుంది. జర్మనీలో ఏటా ఒక్కో మనిషి 11 కిలోల చాక్లెట్లు తింటారట. ప్రపంచ వ్యాప్తంగా క్యాడ్బరీ, మార్స్‌, నెస్లే, ఫెరోరీ, హేర్షేస్‌, లిండిట్‌, ఎజిస్టాక్స్‌, ఆర్కార్‌, మెర్జీ, ఇడ్జీజీ కంపెనీలు టాప్‌ టెన్గా గుర్తింపు పొందాయి. ప్రపంచ వ్యాప్తంగా ఏటా పది లక్షల కోట్ల రూపాయల విలువైన చాక్లెట్‌ ఉత్పత్తులను
వినియోగిస్తున్నారు. ’అసోచామ్‌’ సంస్థ గణాంకాల ప్రకారం మన గ్రావిూణప్రాంతాల్లో చాక్లెట్‌ వ్యాపారం విలువ 750కోట్లరూపాయలట సంవత్సరానికి. ఎందుకంటే వీటి రుచుల్లో సుమారు 600 రకాలు ఉంటాయట. చాక్లెట్‌ వచ్చే చెట్టు శాస్త్రియ నామం థియోబ్రామా కకావ్‌. దీని అర్థం ’దేవతల ఆహారం’. చాక్లెట్లు మొదటిసారిగా పరిచయం ఐరోపాలో 1550 జూలై 7న జరిగింది. అందుకే ఈ రోజును ’చాక్లెట్‌ డే’గా కేటాయించారు. 2009 నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ వేడుకల్ని ఘనంగా చేసుకుంటున్నారు. దీని ఆరోగ్య ప్రయోజనాలు గుర్తించి కాబోలు జూలై 7ను ప్రపంచ చాక్లెట్‌ డేగా పాటిస్తున్నారు.కకోవాలోని టానిన్లు దంతాలవిూద పాచిని తొలగిస్తాయి. కకోవాలో ప్రొటీన్లు, కాల్షియం, కాపర్‌, ఐరన్‌, పొటాషియం, మెగ్నీషియం, బి1, బి2, డి, ఇ విటమిన్లు పుష్కలంగా వుంటాయట. చాª`లకెట్లలోని ఓలియాన్‌ ఆమ్లం గుండె జబ్బుల్ని రానివ్వదు. మెదడులో న్యూరో ట్రాన్స్మీటర్లుగా పనిచేసే సెరిటోనిన్‌, డోపమైన్‌ వంటి రసాయనాల విడుదలకు సహకరించడం వల్ల మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తుంది. అయితే బరువు ఎక్కువగా ఉన్న వాళ్లు మాత్రం క్యాలరీలను లెక్కించుకుని తినాల్సిందే. 1840 సంవత్సరంలో క్యాడ్బరీ చాక్లెట్‌ కంపెనీ ప్రారంభమైంది. మిల్క్‌ చాక్లెటంటే ప్రపంచ వ్యాప్తంగా మోజుపడతారు. కానీ మగవారు మాత్రం డార్క్‌ చాక్లెట్‌ అంటే ఇష్టపడతారని తేలింది. సాధారణంగా చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఇష్టంగా లాగిస్తారు చాª`లకెట్లని.కొకొవా గింజల పొడితో చేసిందే అసలైన చాకొలెట్‌. చాª`లకెట్లలో వుండే కాల్షియం, మెగ్నీషియం, ఎముకల దృఢత్వాన్ని కల్గిస్తాయి. రక్తంలో షుగర్‌ శాతం తగ్గినట్లయితే చాక్లెట్‌ తినడం మంచిది.