నేడు మాతా శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం
ఖమ్మం, జూలై 22 : సత్తుపల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో నిర్మించిన సమగ్ర మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 23వ తేదీ ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభిస్తున్నట్టు జిల్లా ఆసుపత్రి సమన్వయ అధికారి డాక్టర్ పాపాలాల్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.