నేడు వరల్డ్‌ ప్రెస్‌ డే

నిజామాబాద్‌, నవంబర్‌ 15 : 16న వరల్డ్‌ ప్రెస్‌ డే సందర్భంగా శుక్రవారం ఎపియుడబ్ల్యుజె జిల్లా శాఖ ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు జిల్లా శాఖాధికారులు తెలిపారు. స్థానిక ప్రగతి భవన్‌లో మధ్యాహ్నం 12 గంటలకు జరిగే సమావేశానికి జిల్లా కలెక్టర్‌ క్రిస్టిన, ఎస్పీ విక్రమ్‌జిత్‌లు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. జిల్లాలోని జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.