నేడు వైరాలో చెట్లు వేలం
ఖమ్మం, అక్టోబర్ 28: వైరలోని పశుగణాభివృద్ధి సంస్థ ఆవరణంలోని చెట్లకు సోమవారంనాడు వేలంపాట నిర్వహించనున్నట్టు సంస్థ కార్యదర్శి డాక్టర్ నరేంద్రకుమార్ తెలిపారు. వాస్తవంగా ఈ నెల 18వ తేదీన వేలం పాట నిర్వహించాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల దానిని వాయిదా వేసినట్లు తెలిపారు. వేలానికి సంబంధించిన అన్ని నిబంధనలు పూర్తి చేశామన్నారు. తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్న వేలం పాటలో ఆసక్తి గల వారు పాల్గొనాలని ఆయన కోరారు.