నేడు సంస్కృతి మిలప్‌

నిజామాబాద్‌, నవంబర్‌ 23 : నగరంలోని నవ్యభారతి గ్లోబల్‌ స్కూలో ఈ నెల 24 శనివారం రోజున సంస్కృతి మిలప్‌ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు  పాఠశాల ప్రిన్సిపల్‌ ఎస్తేర్‌ మేరీ సుందరం తెలిపారు. శుక్రవారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ సంస్కృతి మిలప్‌ కార్యక్రమం ద్వారా భారత దేశంలోని వివిధ రాష్ట్రాల యొక్క సంస్కృతి సంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, ఆహారపు అలవాట్లు మొదలైన వాటన్నింటినీ ప్రతిబింబింప చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్‌ రేంజ్‌ డిఐజి  సంజయ్‌ ముఖ్య అతిథిగా పాల్గొంటారన్నారు. పాఠశాల విద్యార్థుల తల్లితండ్రులు, ఇతర పాఠశాలల విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరారు. విలేకరుల సమావేశంలో పాఠశాల సంధానకర్త మహిత, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.