నేడు సాంస్కృతిక కార్యక్రమాలు
జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
జనం సాక్షి బ్యూరో.నల్గొండ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రొత్సవాల సందర్భంగా నేడు(ఆదివారం,18.9.22) న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి తెలిపారు .నల్గొండ జిల్లా కేంద్రం చిన వెంకట్ రెడ్డి పంక్షన్ హల్ లో సాయంత్రం 4 గంటలకు జాతీయ సమైక్యత,తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.జిల్లాలోని పుర ప్రముఖులు, కళాభి మానులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఈ ప్రకటన లో తెలిపారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా కలెక్టర్ .శనివారం జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి అదనపు కలెక్టర్ లు రాహుల్ శర్మ,భాస్కర్ రావు లతో కలిసి చిన వెంకట్ రెడ్డి ఫంక్షన్ హల్ లో ఏర్పాట్లు పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం లో అర్.డి. ఓ.జగన్నాథ రావు,డి.ఈ. ఓ బిక్షపతి,డి.పి.అర్. ఓ శ్రీనివాస్,తహశీల్దార్ నాగార్జున తదితరులు పాల్గొన్నారు