నేడు సీంగా జయ ప్రమాణం

4
ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌సెల్వం రాజీనామా

గవర్నర్‌ రోశయ్యను కలిసిన జయ

చెన్నై,మే22(జనంసాక్షి): తమిళనాడు సిఎంగా జయలలిత ఐదోమారు శనివారం ప్రమాణం చేయనున్నారు. ఆమె శాసనసభాపక్షనేతగా ఎన్నిక కాగా, ప్రస్తుత సిఎం పన్నీర్‌ సెల్వం రాజీనామ చేశారు.  శుక్రవారం ఉదయం అన్నా డీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షురాలు జయలలితను శాసనసభాపక్షనేతగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సమావేశానికి సీఎం పన్నీర్‌ సెల్వంతో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. మధ్యాహ్నం ఒంటిగంటకు జయలలిత తమిళనాడు గవర్నర్‌ రోశయ్యతో భేటీ అయ్యారు. దీంతో శనివారం  తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ప్రత్యేక కోర్టు జయలలితకు శిక్ష విధించటంతో సీఎం పదవికి ఆమె రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అన్నా డీఎంకే పార్టీకి చెందిన సీనియర్‌నేత పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నా డిఎమ్‌.కె అదినేత్రి జయలలిత మళ్లీ పగ్గాలు చేపట్టనున్నారు.అన్నా డి.ఎమ్‌.కె. శాసనసభ్యుల సమావేశం ఆమెను ఏకగ్రీవంగా నేతగా ఎన్నుకున్నారు. గవర్నర్‌ రోశయ్యను కలిసి జయలలిత తీర్మానం లేఖను అందచేస్తారు. శనివారం నాడు జయలలిత ప్రమాణ స్వీకారం చేస్తారు.తిరిగి ఆమె మళ్లీ సిఎంగా గద్దె నెక్కనుండడంతో ఎఐడిఎంకె వర్గాల్లో ఆనందం వ్యక్తం అవుతోంది. ఇటీవలే కర్ణాటక హైకోర్టు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను నిర్దోషిగా ప్రకటించడంతో ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు మార్గం సుగమమైంది. అన్నా డీఎంకే శాసనసభాపక్ష నేతగా జయలలిత ఏకగీవ్రంగా ఎన్నిక కావడంతో తమిళనాడులో ఆపార్టీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. జయ ఇంటి వద్దకు భారీగా తరలి వచ్చిన అభిమానులు సందడి చేశారు. తిరిగి సిఎంగా ప్రమాణం చేయనుండడంతో జయలలిత ఇంటి వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఇంతవరకు ముఖ్యమంత్రిగా ఉన్న పన్నీర్‌ సెల్వం తిరిగి మంత్రి అవుతారు.దేశ చరిత్రలో ఇలా రెండుసార్లు ముఖ్యమంత్రి పదవి చేసినవారు మంత్రి గా బాధ్యతలు తీసుకోవడం జరగలేదు. తమిళనాడు లో ప్రత్యేక పరిస్థితిలో ఈ రాజకీయాలు సాగుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి పదవికి పన్నీర్‌ సెల్వం రాజీనా చేశారు. శుక్రవారం ఉదయం తన రాజీనామా లేఖను తమిళనాడు గవర్నర్‌ రోశయ్యకు అందజేశారు. పన్నీర్‌ సెల్వం రాజీనామాను గవర్నర్‌ ఆమోదించారు. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అన్నా డీఎంకే శాసనసభాపక్షనేతగా ఎన్నికైన జయలలితకు గవర్నర్‌ రోశయ్య ఆహ్వానం పంపారు.