నేడు..స్వర్గీయ మాజీ మంత్రి ఎం.మణిక్ రావు మహరాజ్ 6వ వర్దంతి.
తాండూరు సెప్టెంబర్ 8 (జనంసాక్షి)స్వర్గీయ మాజీ మంత్రి ఎం.మణిక్ రావు మహరాజ్ 6వ వర్దంతిని పురస్కరించుకుని మహారాజుల కుటుంబం ఆధ్వర్యంలో సిసిఐ రోడ్ డిసిఎంఎస్ కాంప్లెక్స్ ఎదురుగా మణిక్ రావు విగ్రహానికి పూల మాలలతో నివాళులు అర్పించడం జరుగుతుంది. పిపుల్స్ డిగ్రీ కళాశాలలో కూడా మాణిక్ రావు మహరాజ్ చిత్ర పటానికి పులా మాల వేసి నివాళులర్పించడం జరుగుతుంది. ఆత్మీయులు ఈ రెండు కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు.కావున మాణిక్ రావు మహరాజ్ అభిమానులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, బంధువులు, రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ప్రతి ఒక్కరు హాజరై విజయవంతం చేయాలని యం. రమేష్,యం నారాయణ రావు, యం సురేష్, యెస్ వెంకటేష్, యం నరేష్, యం రాకేష్, యం రోహిత్ మరియు,మహారాజుల కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.