నేడు 120 దేవాలయాల్లో మనగుడి

నిజామాబాద్‌, నవంబర్‌ 27 : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం జిల్లాలో గుర్తించిన 120 దేవాలయాల్లో మనగుడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు టిటిడి జిల్లా ఇన్‌చార్జి నాగరాజు తెలిపారు.  ఈ దేవాలయాల్లో ధూప దీప నైవేద్య కార్యక్రమాలు జరుపుతామన్నారు. ఉదయం ఐదుగంటల నుండి రాత్రి 8గంటల వరకు భజనలు, స్వామి సంకీర్తనలు, అభిషేకాలు, పూజలు జరుగుతాయన్నారు. తిరుమల నుండి వచ్చిక కంకణాలు, పసుపుకుంకుమలు, అక్షింతలు భక్తులకు అందజేస్తామన్నారు. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు బాలబాలికలకు పద్యపఠన పోటీలు నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని నాగరాజు తెలిపారు.