నేడే లాల్‌ దర్జా మహంకాళి బోనాలు

` భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు
` విస్తృతంగా బందోబస్తు ఏర్పాట్లు
` పట్టు వస్త్రాలు సమర్పించనున్న మంత్రులు
` బోనాల సందర్భంగా ట్రాఫిక్‌ మళ్లీంపు
హైదరాబాద్‌(జనంసాక్షి): భాగ్యనరంలోని పాతబస్తీ సింహవాహిని మహంకాళి బోనాల మహోత్సవానికి సర్వం సిద్ధమైంది. జాతర సందర్భంగా లాల్‌ దర్వాజ ముస్తాబు అయ్యింది. పాత బస్తీలోని సింహవాహిని ఆలయంతో పాటు మరో 330 ఆలయాలను శోభాయమానంగా అలంకరించారు. ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు లాల్‌ దర్వాజ సింహవాహిని అమ్మవారికి జల్లెకడువ నిర్వహించనున్నారు. తెల్లవారు జామున 4 గంటలకు బలిహరణ, ఉదయం 5.30 గంటలకు దేవి మహాభిషేకం అనంతరం యాత్రికులను దర్శనానికి అనుమతిస్తారు. బోనాలను పురస్కరించుకుని లాల్‌ దర్వాజ సింహవాహిని ఆలయంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, శాలబండ అక్కన్న మాదన్న ఆలయంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, చార్మినార్‌ భాగ్యలక్ష్మి ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మరోవైపు కార్వాన్‌ దర్బార్‌ మైసమ్మ ఆలయంలో మంత్రి దామోదర రాజనర్సింహ, విూరాలం మండి మహంకాళి ఆలయంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, సబ్జీమండి నల్ల పోచమ్మ ఆలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. ఇంకా చిలకలగూడ కట్ట మైసమ్మ ఆలయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఎన్టీఆర్‌ నగర్‌ సరూర్‌ నగర్‌ ఖిలా మైసమ్మ ఆలయంలో మంత్రి దనసరి అనసూయ సీతక్క, నాచారం ఉప్పల్‌ మహంకాళి సహిత మహాకాళేశ్వర స్వామి ఆలయంలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. లాల్‌దర్వాజ బోనాలకు వచ్చే యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 100 ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచినట్లు గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. పాతబస్తీ లాల్‌ దర్వాజ బోనాలు సందర్భంగా 2,500 మంది పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. పాత బస్తీలోని ఫలక్‌నుమా, చార్మినార్‌, బహుదూర్‌పురా, విూర్‌చౌక్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈనెల 28, 29 తేదీల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు నగర ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ తెలిపారు. ఆదివారం బోనాల ఊరేగింపు, సోమవారం ఘటాల ఊరేగింపు పాతబస్తీలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆది, సోమవారాల్లో రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు అదనపు సీపీ వెల్లడిరచారు. అక్కన్న మాదన్న దేవాలయం నుండి నయాపూల్‌ వరకు ఏనుగుపై ఈ భారీ ర్యాలీ తెల్లవారుజాము నుండి రాత్రి వరకు కొనసాగుతుంది. కాగా.. లాల్‌ దర్వాజ దేవాలయం, ఎంజీబీఎస్‌, రెత్గిªల్‌, జేబీఎస్‌ వద్ద హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేశారు. సమాచారం కోసం 9959226154, 9959 226160 నంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడిరచారు. హిమ్మత్‌పురా నుంచి షంషీర్‌గంజ్‌ వైపు వెళ్లే వాహనాలను గౌలిపురా, సుధా టాకీస్‌ విూదుగా మళ్లిస్తారు. చాంద్రాయణగుట్ట, ఉప్పగూడ నుంచి నగరంలోకి వచ్చే వాహనాలను గౌలిపుర, నాగుల్చింత విూదుగా మళ్లిస్తారు. మహబూబ్‌ నగర్‌ ఎక్స్‌ రోడ్డు నుంచి వచ్చే వాహనాలను జహనుమా, గోశాల, తాడ్‌బాన్‌, ఖిలావత్‌ విూదుగా మళ్లిస్తారు.ంజిన్‌ బౌలి నుండి షంషీర్‌గంజ్‌ వైపు వచ్చే వాహనాలను మళ్లించడం జరుగుతుంది. చార్మినార్‌ నుంచి వచ్చే వాహనాలను హరిబౌలి వద్ద మళ్లిస్తారు. చాదర్‌ఘాట్‌ నుంచి వచ్చే వాహనాలను పురానా హవేలీ రోడ్డు, శివాజీ బ్రిడ్జి వద్ద మళ్లిస్తారు. మొగల్‌పురా, విూర్‌చౌక్‌ నుంచి వచ్చే వాహనాలను విూర్‌ కా డియారా వైపు మళ్లించనున్నారు.