నేత కార్మికులకుజీవితం పట్ల భరోసా కల్పించాము.

సైకాలజిస్ట్ పున్నం చందర్.

రాజన్నసిరిసిల్లబ్యూరో. సెప్టెంబర్ 10. (జనం సాక్షి). సిరిసిల్ల నేత కార్మికులకు జీవితం పట్ల భరోసా కల్పించేందుకు పలు కార్యక్రమాలు చేపట్టామని సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. శనివారం ఆత్మహత్యల నివారణ దినోత్సవం పురస్కరించుకొని మనో వికాస కేంద్రం ఆధ్వర్యంలో పట్టణంలోని వెంకట్రావు నగర్ లో సదస్సు నిర్వహించారు. సదస్సులో సైకాలజిస్ట్ పున్నం చందర్ మాట్లాడుతూ ఒకనాడు ఆత్మహత్యలతో ఉన్న సిరిసిల్ల నేడు ఆత్మవిశ్వాసంతో నిలబడిందని తెలిపారు. కార్మికులు ఆత్మవిశ్వాసం పెంపొందించింది అనేక కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. మైండ్ కేర్ సెంటర్ ద్వారా నిరంతరం కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. కార్యక్రమంలో మైండ్ కేర్ సెంటర్ సిబ్బంది బూర శ్రీమతి, రా పెళ్లి లత, కొండ ఉమా, వేముల అన్నపూర్ణ పలువురు కార్మికులు పాల్గొన్నారు.