నేదునూరు ప్లాంట్ వద్ద ఆందోళనకు దిగిన సీపీఐ
కరీంనగర్, జనంసాక్షి: జిల్లాలోని తిమ్మాపురం మండలం నేదునూరు జెన్‌కో విద్యుత్ ప్లాంట్ శిలాఫలకం వద్ద సీపీఐ ఆందోళనకు దిగింది. విద్యుత్ ప్రాజెక్టును వెంటనే చేపట్టాలని నాయకులు డిమాండ్ చేశారు. ఆందోళన కార్యక్రమంలో సీసీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, పలువురు నేతలు పాల్గొన్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు నాయకులు అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.