‘నేను అమెరికన్ను మాత్రమే’

వాషింగ్టన్: లూసియానా రాష్ట్ర గవర్నర్, భారతీయ అమెరికన్ బాబీ జిందాల్ వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. తాను ఇండో-అమెరికన్ను కాదని.. అమెరికన్ను మాత్రమే అని ఆయన  సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘నా తల్లిదండ్రులు అమెరికన్లుగా మారడానికే అమెరికాకి వచ్చారు… కానీ భారతీయ-అమెరికన్గా ఉండడానికి కాదు’ అని బాబీ జిందాల్ అన్నారు. అమెరికన్లుగా మారడానికే ఇక్కడకు వచ్చామని అమ్మానాన్నలు  సోదరుడితో పాటూ తకు చెప్పేవాళ్లని ఆయన పేర్కొన్నారు.

భారతీయుడని పిలిపించుకోవాలంటే భారత్లోనే ఉండేవాడినన్నారు. అధిక అవకాశాలతో పాటు స్వేచ్ఛ దొరుకుతుందనే నాలుగు దశాబ్దాల కిందట అమెరికాకు వలస వచ్చినట్లు చెప్పారు. వలసవాదులను అందరితోపాటు సమానంగా గౌరవించాలని, అలా చేస్తే దేశాన్ని మరింత పటిష్టం చేయడంతో పాటు స్వేచ్ఛను కాపాడిన వాళ్లం అవుతామని బాబీ జిందాల్  పేర్కొన్నారు. మరోవైపు లండన్లోని హెన్రీ జాక్సన్ సొసైటీలో వచ్చే సోమవారం ఆయన ప్రసంగించనున్నారు. కాగా అక్కడ పాల్గొనబోయే  మొదటి భారతీయ-అమెరికన్ అని గవర్నర్ కార్యాలయం అధికారులు తెలిపారు.