నేను రాజీనామా చేయను
– జింబాబ్వే అధ్యక్షుడు ముగాబే
హరారే, నవంబర్17(జనంసాక్షి): అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే నిరాకరించారు. శుక్రవారం ముగాబేను రాజీనామా చేయాలని కొందరు సైన్యాధికారులు ఆయనతో సమావేశమై చర్చించారు. ‘ముగాబేను మేను కలిశాం. పదవి నుంచి తప్పుకొనేందుకు ఆయన నిరాకరించారు. ఆయనకు మరికొంత సమయం ఇచ్చి చూస్తాం’ అని పేరు చెప్పేందుకు ఇష్టపడని ఓ ఆర్మీ అధికారి వెల్లడించారు. ప్రస్తుతం ముగాబేను ఆ దేశ సైన్యం గృహ నిర్బంధంలో ఉంచింది. ముగాబే తన రాజకీయ వారసురాలిగా భార్య గ్రేస్‌ను నిలబెట్టడాన్ని మాజీ ప్రధాని మోర్గాన్ సవంగిరాయ్‌తో పాటు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయన తప్పకుండా తన అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారని సవంగిరాయ్ విూడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. జింబాబ్వేలో నెలకొన్న రాజకీయ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు సదరన్ ఆఫ్రికన్ డెవలప్‌మెంట్ కమ్యూనిటీ(ఎస్‌ఏడీసీ) ప్రయత్నిస్తోంది. శాంతి యుతంగా జింబాబ్వే సమస్యను పరిష్కరించేందుకు సహాయం చేయాల్సిందిగా ఎస్‌ఏడీసీ పొరుగుదేశాలను కోరుతోంది.