నేను వ్యక్తిగతంగా మాట్లాడను

5

– రాజీవ్‌ హంతకుల విడుదలపై సర్కారుదే తుది నిర్ణయం

– ఈపీఎఫ్‌పై పన్ను నిర్ణయం సరికాదు

న్యూఢిల్లీ,మార్చి3(జనంసాక్షి): పార్లమెంట్‌లో రాజీవ్‌గాంధీ హంతకుల విడుదల విషయం దుమారం రేపనుంది. ఇప్పటికే ఈ విషయమై మల్లిఖార్జున ఖర్గే పార్లమెంట్‌లో ప్రస్తావించారు కూడా. కాని ఇదే విషయమై కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ మాత్రం తాను కొడుకునైనందున తానేవిూ మాట్లాడనని అన్నారు. దీనిపై స్పందించిన రాహుల్‌ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హంతకుల విడుదల విషయంలో తానేవిూ మాట్లాడలేనని స్పష్టం చేశారు. ముఖ్యంగా రాజీవ్‌గాంధీ హత్య కేసులో ఏడుగురు దోషులను విడిచిపెట్టే విషయంలో ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాలని, అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. రాజీవ్‌ హత్య కేసు దోషులను విడిచిపెట్టే విషయంలో కేంద్ర ¬ంశాఖ నిర్ణయం  కోరుతూ తమిళనాడు ప్రభుత్వం ఆర్జీ పెట్టిన విషయం తెలసిందే. ఇది రాజకీయంగా దుమారం రేపుతుంది. ఇప్పటికే తమిళనాడు చీఫ్‌ సెక్రటరీ కె.జ్ఞానదేశికన్‌ కేంద్ర ¬ంశాఖ కార్యదర్శి రాజీవ్‌ మహర్షికి ఈ విషయమై ఓ లేఖ రాసిన విషయం వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం దోషులను విడిచిపెట్టేందుకు నిశ్చయించుకుందని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ సలహా తీసుకోవడం అనివార్య మని ఆ లేఖలో అధికారి పేర్కొన్నారు. సెక్షన్‌ 435 క్రిమినల్‌ ప్రొసీడర్‌ కోడ్‌ కింద కేంద్రం నిర్ణయాన్ని తీసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. ఈ కేసులో జీవిత ఖైదు పడిన ఏడుగురు దోషులు 24 ఏళ్లుగా తమిళనాడులో జైలు శిక్ష అనుభవిస్తున్నారు. కాగా మరోవైపు ఇదే అంశంపై గురువారం కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం కూడా ఇచ్చింది. రాజీవ్‌ దోషులను విడుదల చేస్తే అంతకన్నా ఘోరం మరొకటి ఉండదని లోకసభలో కాంగ్రెస్‌ నేత మల్లిఖార్జున్‌ ఖర్గే  ఇప్పటికే గట్టిగా వాదించారు. ఇది  దేశ ఐక్యతకే భంగం కలిగే ప్రమాదమని, రాజకీయం తగదని సూచించారు. తమిళనాడు రాష్ట్రం రాసిన లేఖను కేంద్ర ¬ంశాఖ బయటపెట్టడం దారుణమని ఆయన అన్నారు. అలాంటి లేఖలను ప్రోత్సహించరాదని, ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని  మల్లిఖార్జున్‌ ఖర్గే చెప్పారు. దీంతో ఈ విషయమై కేంద్ర ¬మ మంత్రి స్పందించారు. తమిళనాడు ప్రభుత్వం రాసిన లేఖను పరిశీలిస్తున్నామని, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటిస్తామని చెప్పడం విశేషం. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ పలు విషయాలను ప్రస్తావించారు. ఈ విషయమై తాను మాట్లడడనని,  ప్రావిడెంట్‌ ఫండ్‌ వడ్డీపై పన్ను వేయాలని భావిస్తున్న నిర్ణయాన్ని మాత్రం కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని రాహుల్‌ గాంధీ సూచించారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్‌లో రాజకీయ వేడి తీవ్రమవనుంది.

ఈపీఎఫ్‌ పై పన్ను నిర్ణయం ఉపసంహరించుకోవాలి:రాహుల్‌

న్యూఢిల్లీ: ఈపీఎఫ్‌ (ఉద్యోగుల భవిష్య నిధి) లో దాచుకున్న మొత్తాన్ని వెనక్కు తీసుకునేటపుడు కొంత పన్ను విధించాలనే కేంద్రం ప్రతిపాదనను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు రక్షణ కవచం లాంటిదైన ఈపీఎఫ్‌పై పన్ను విధించాలనడం సరైందికాదన్నారు. దీనిపై ప్రధాని మోడీ వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు.